క్రీడాభూమి

భారత్ ఏ జట్టుపై కివీస్ ఏ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రిస్ట్‌చర్చ్, జనవరి 26: మార్క్ చాప్మాన్ అజేయ సెంచరీకి తోడు టాడ్ అస్టిల్ అర్ధ సెంచరీ తొడవడంతో న్యూజిలాండ్ ఏ జట్టు భారత్ ఏ జట్టుపై 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆదివారం జరిగిన మూడో అనధికార వనే్డలో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయ 270 పరుగులు చేసింది. మార్క్ చాప్మాన్ (110, నాటౌట్), టాడ్ అస్టిల్ (56) రాణించారు. భారత బౌలర్లలో ఇషాన్ పోరెల్ 3 వికెట్లు తీయగా, రాహుల్ చాహర్ 2, సందీప్ వారియర్, అక్షర్ పటేల్‌లు ఒక్కో వికెట్ తీసుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 265 పరుగులకే కుప్పకూలి, 5 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. వికెట్ కీపర్ ఇసాన్ కిషన్ (71, నాటౌట్), ఓపెనర్లు పృథ్వీ షా (55), రుతురాజ్ గైక్వాడ్ (44) మాత్రమే రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో కైల్ జెమీసన్ 4 వికెట్లు పడగొట్టగా, అజాజ్ పటేల్ 3, రచిన్ రవీంద్ర 2, టాడ్ అస్టిల్ 1 వికెట్ తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.