క్రీడాభూమి

గెలిస్తే తొలిసారి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హామిల్టన్ : వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న కోహ్లీసేన మరో సిరీస్ విజయంపై కనే్నసింది. న్యూజిలాండ్‌పై పొట్టి ఫార్మాట్‌లో ఇప్పటివరకు సిరీస్ విజయం సాధించలేని భారత్‌కు ఈసారి ఆ అవకాశమొచ్చింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా టీమిండియా ఇప్పటికే మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఘన విజయం సాధించింది. నేడు జరిగే మూడో మ్యాచ్ లోనూ కోహ్లీసేన గెలిస్తే మొదటిసారి న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్ గెలిచినట్లవుతుంది. 2009లో ఇరు జట్లు తలపడగా 0-2 తేడాతో భారత్ పరాజయాన్ని చవి చూసింది. గతేడాది మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా 1-2 తేడాతో త్రుటిలో సిరీస్ అందుకునే అవకా శాన్ని చేజార్చు కుంది. మరోవైపు న్యూజిలాండ్ జట్టు కూడా ఎలాగై నా గెలవా లనే కసితో కనిపిస్తోంది. మొదటి మ్యాచ్‌లో ఫర్వాలేదని పించి నా, రెండో మ్యాచ్‌లో సొంత గడ్డపై పూర్తిగా తెలిపోవడంతో జట్టులో మార్పులు చోటు చేసుకునే అవకాముంది. బౌలింగ్ విభా గంలో ఫర్వాలేదనిపిస్తున్న కివీస్, బ్యాటింగ్‌లో మాత్రం పూర్తిగా విఫలమవుతోంది.
రోహిత్ ఈసారైనా..
గత రెండు మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ విఫలం కాగా, నేడు జరిగే మ్యాచ్‌లో రాణి ంచాలని జట్టుతో పాటు అభిమానులు కోరుకుంటున్నారు.
అయతే న్యూజిలాం డ్‌పై ఏమాత్రం సరైన రికార్డులోని హిట్‌మ్యాన్ రెండు మ్యాచు ల్లోనూ తొలి ఓవర్‌లోనే అవుటై నిరాశ పరిచాడు. రోహిత్‌తో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా రాణిస్తే సిరీస్ భారత్ సొంతం అవుతుందనడం లో ఎలాంటి సందేహం లేదు.
రాహుల్.. అయ్యర్..
కివీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో ఇప్పటివరకు నిలకడగా రాణించింది ఓపెనర్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌తో పాటు నాలుగో స్థానాన్ని సుస్థిరం చేసుకున్న యువ ఆటగాడు శ్రేయా స్ అయ్యర్ మాత్రమే. గత రెండు మ్యాచ్‌ల్లోనూ కోహ్లీసేన విజయంలో వీరిద్దరి దే కీలకపాత్ర. చివరి టీ20ల్లో అర్ధ సెంచరీ సాధించిన రాహుల్, నేడు జరిగే మ్యాచ్‌లోనూ రాణిస్తాడని టీమ్ మేనేజ్‌మెంట్ ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు గత రెండు మ్యాచ్‌ల్లో ఆడిన జట్టులో ఎ లాంటి మార్పు చోటు చేసుకునే అవకాశం లేనట్లు కనిపిస్తోంది. అయతే రిషభ్ పంత్, నవదీస్ సైనీ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నా వారికి నిరాశే దక్కనుంది.
*కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ (ఫైల్)