క్రీడాభూమి

ఫ్రాన్స్, రుమేనియా తొలిపోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, జూన్ 9: మినీ సాకర్ వరల్డ్ కప్‌గా పిలిచే యూరోపియన్ చాంపియన్‌షిప్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. యూరో ‘2016’లో జరిగే తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్, రుమేనియా జట్లు ఢీ కొంటాయి. మొట్టమొదటిసారి ఈ టోర్నీలో 24 జట్లు పాల్గొంటున్నాయి. 1998లో జరిగిన వరల్డ్ కప్ టోర్నీకి ఫ్రాన్స్ ఆతిథ్యం ఇవ్వగా, ఆ జట్టును దిడియర్ డెస్‌చాంప్స్ విజయపథంలో నడిపించాడు. అతనే ఇప్పుడు ఫ్రాన్స్‌కు జాతీయ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. డెస్‌చాంప్స్ సామర్థ్యంపై అపారమైన నమ్మకం ఉన్న అభిమానులు ఈసారి యూరో కప్ తమకే దక్కుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, నిరుడు నవంబర్‌లో పారిస్‌పై ఉగ్రవాదులు 13 వేరువేరు ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో 130 మంది మృతి చెందిన సంఘటన అటు అధికారులను, ఇటు ఆటగాళ్లను ఆందోళనకు గురి చేస్తున్నది. అలాంటి సంఘటన పునరావృతం కాకుండా భద్రతా విభాగం అన్ని చర్యలు తీసుకుంటున్నది. అప్పటి దాడుల్లో స్టేడ్ డి ఫ్రాన్స్‌ను కూడా ఉగ్రవాదులు లక్ష్యంగా ఎంచుకున్నారు. ఆ సమయంలో ఫ్రాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో డెస్‌చాంప్స్ జర్మనీ తరఫున ఆడాడు. ఇప్పుడు అతను ఫ్రెంచ్ జట్టు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఎలాంటి ఆటంకాలు లేకుండా యూరో 2016 పూర్తికావాలని అతను కోరుకుంటున్నాడు. ఇలావుంటే, ఫ్రాన్స్‌తోపాటు స్పెయిన్, జర్మనీ, ఇంగ్లాండ్ వంటి మేటి జట్లు ఈసారి టైటిల్ కోసం తీవ్రంగా పోటీపడుతున్నాయి. బరిలో ఉన్న ఆటగాళ్లలో పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో స్టార్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాడు. ప్రపంచ మేటి సాకర్ క్రీడాకారుల్లో ఒకడిగా గుర్తింపు సంపాదించిన అతను ఈ టోర్నీలో ఏ విధంగా రాణిస్తాడన్నది ఆసక్తిని రేపుతున్నది.
రూనీకి పరీక్ష!
ఇంగ్లాండ్ సాకర్ జట్టు కెప్టెన్ వేన్ రూనీ సామర్థ్యానికి యూరోపియన్ సాకర్ చాంపియన్ పరీక్షగా నిలవనుంది. ఇంగ్లాండ్ తరఫున అత్యధిక మ్యాచ్‌ల్లో పాల్గొన్న ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న రూనీ ఎక్కువ గోల్స్ చేసిన క్రీడాకారుల్లో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించాడు. ఇంగ్లాండ్ తరఫున పీటర్ షిల్టన్ 125, డేవిడ్ బెక్‌హామ్ 115, స్టీవ్ గెరార్డ్ 114 మ్యాచ్‌లు ఆడారు. రూనీ ఇప్పటి వరకూ 110 మ్యాచ్‌లు ఆడి, 52 గోల్స్ సాధించాడు. బాబీ చార్ల్‌టన్ 49, గారీ లీనేకర్ 48 గోల్స్‌తో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇంగ్లాండ్ సాకర్ చరిత్రలోనే అత్యంత సమర్థుడైన క్రీడాకారుల్లో ఒకడిగా గుర్తింపు సంపాదించిన రూనీపై అభిమానులు కోటి ఆశలు పెట్టుకున్నారు. ఈనెల 10 నుంచి వచ్చేనెల 10వ తేదీ వరకు ఫ్రాన్స్‌లో జరిగే యూరోపియన్ సాకర్ చాంపియన్‌షిప్ (యూరో 2016)లో ఇంగ్లాండ్‌ను విజయపథంలో నడిపిస్తాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వారి అంచనాలకు తగినట్టుగా తాను రాణించడమేగాక, జట్టును విజయపథంలో నడిపించడం అతనికి అసాధ్యం కాకపోవచ్చు. కానీ, తీవ్రమైన ఒత్తిడిని జయించి, అటు క్రీడాకారుడిగా, ఇటు కెప్టెన్‌గా సేవలు అందించడం కత్తిమీద సాము చేయడమే. మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రూనీ ఇటీవలే ఆ జట్టు మేనేజర్ జోస్ వౌరిన్హోను కలిసి చర్చించడం ఆసక్తిని రేపుతున్నది. చాంపియన్స్ లీగ్‌లో మాంచెస్టర్ యునైటెడ్ దారుణంగా విఫలమై, ఐదో స్థానంతో సంతృప్తి చెందాల్సి రావడంతో అభిమానులతోపాటు బ్రిటిష్ సాకర్ అధికారులు కూడా తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అప్పటి వరకూ తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించిన లూయిస్ వాన్‌గాల్‌కు ఉద్వాసన తప్పలేదు. అతని స్థానంలో వౌరిన్హో మూడేళ్ల కాంట్రాక్టును కుదుర్చుకున్నాడు. చెల్సియాతో అతని కాంట్రాక్టు పూర్తి కావడంతో, ఇంగ్లాండ్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించే అవకాశాన్ని సులభంగానే దక్కించుకున్నాడు. పోర్చుగల్‌కు చెందిన వౌరిన్హో యూరో 2016లో గ్రూప్ ‘బి’ నుంచి బరిలోకి దిగుతున్న ఇంగ్లాండ్‌కు విజయాలను సాధించి పెట్టడమే లక్ష్యంగా ఎంచుకున్నాడు. గ్రూప్ ‘ఎఫ్’ నుంచి తలపడుతున్న పోర్చుగల్‌తో గ్రూప్ దశలో ఇంగ్లాండ్‌ను ఢీకొనే అవకాశం లేదు. అయితే, ప్లే ఆఫ్ దశలో ఇరు జట్లు పరస్పరం ఎదురుపడే ప్రమాదం ఉంది. ఇంగ్లాండ్ జట్టుకు మేనేజర్‌గా బాధ్యతలు తీసుకున్న వౌరిన్హోతో చర్చలు జరపడం వెనుక యూరో చాంపియన్‌షిప్‌లో అనుసరించాల్సిన వ్యూహాలే ప్రధాన కారణంగా తెలుస్తోంది. జట్టుకు టైటిల్‌ను సాధించి పెట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలను రూనీ మొదలు పెట్టాడనడానికి అతను వౌరిన్హోతో జరిపిన చర్చలే నిదర్శనం. అతని ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి. 16 జట్లు పోటీపడడం ఆనవాయితీగా ఉండగా, ఈసారి నుంచి జట్లను 24కు పెంచారు. దీనితో పోటీ తీవ్రతరం కానుంది. ఈ పరిస్థితుల్లో రూనీ సేనకు యూరో టైటిల్ అనుకున్నంత సులభం కాదన్నది వాస్తవం.

చిత్రం ఇంగ్లాండ్ సాకర్ జట్టు కెప్టెన్ వేన్ రూనీ ప్రాక్టీస్