క్రీడాభూమి

మరో విజయంపై టీమిండియా కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, జనవరి 30: న్యూజిలాండ్‌పై టీ-20 సిరీస్‌ను ఇప్పటికే 3-0 తేడాతో కైవసం చేసుకున్న విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా మరో విజయంపై కనే్నసింది. శుక్రవారం జరిగే నాలుగో వనే్డలోనూ విజయభేరి మోగించాలన్న పట్టుదలతో ఉంది. సిరీస్ గెల్చుకున్నంత మాత్రాన మిగతా మ్యాచ్‌లను తేలిగ్గా తీసుకోబోమని కెప్టెన్ కోహ్లీ, చీఫ్ కోచ్ రవి శాస్ర్తీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జరగబోయే టీ-20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని, జట్టులో అవసరమైన మార్పులుచేర్పులతో ప్రయోగాలు చేస్తూనే, మరోవైపు విజయపరంపరలను కొసాగించాలన్నది
భారత జట్టు మేనేజ్‌మెంట్ లక్ష్యంగా కనిపిస్తున్నది. చివరి వరకూ అత్యంత ఉత్కంఠ భరితంగా కొనసాగి, చివరికి సూపర్ ఓవర్ వరకూ వెళ్లిన మూడో టీ-20లో సంచలన విజయాన్ని నమోదు చేయడం భారత శిబిరంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. సూపర్ ఓవర్ పోరులో జట్టును గెలిపించిన మహమ్మద్ షమీ, రోహిత్ శర్మకు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. సిరీస్‌ను దక్కించుకోవడంతో భారత్ ఎలాంటి ఒత్తిడి లేకుండా నాలుగో మ్యాచ్‌లో బరిలోకి దిగుతుండగా, కనీసం చివరి రెండు మ్యాచ్‌లనైనా గెల్చుకోవడం ద్వారా కొంత వరకైనా పరువు నిలబెట్టుకోవాలన్నది న్యూజిలాండ్ ప్రయత్నం.
నిజానికి చివరి రెండు మ్యాచ్‌ల మధ్య కివీస్ క్రికెట్ అధికారులు ఎక్కువ రోజుల విరామాన్ని ఇవ్వలేదు. నాలుగో టీ-20 శుక్రవారం జరిగితే, చివరిదైన ఐదో మ్యాచ్ ఆదివారం ఆడాల్సి ఉంటుంది. ఇప్పటికే బాగా అలసిపోయిన ఇరు జట్ల ఆటగాళ్లకు ఎక్కువ సేపు నెట్ ప్రాక్టీస్ చేసే అవకాశం కూడా లభించడం లేదు. ఇలావుంటే, భారత్ ఎలాంటి మార్పులుచేర్పులు చేస్తుంది? ప్రయోగాలకు సిద్ధమవుతుందా? లేదా? విజయపరంపరను కొనసాగించేందుకు, విన్నింగ్ టీం ఫార్ములాను అథాతథంగా ఉంచుతుందా? రాబోయే టీ-20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని, ఎవరైనా ఆటగాళ్ల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు చివరి రెండు మ్యాచ్‌లను వేదికగా ఎంచుకుంటుందా? వంటి అనేక ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. సంజూ శాంసన్, రిషభ్ పంత్ వాటి ఆటగాళ్లు అవకాశాలు కోసం నిరీక్షిస్తున్నారు. వారిలో ఎవరికైనా అవకాశం ఇస్తారా లేక లోకేష్ రాహుల్‌కే కీపింగ్ బాధ్యతలను అప్పగిస్తారా అనేది కూడా సస్పెన్స్‌గా మారింది.
మనీష్ పాండే, శివమ్ డూబేకు మరికొన్ని అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని విశే్లషకులు కూడా అంటున్నారు. చివరి రెండు మ్యాచ్‌ల్లో, ఒకదానిలో కోహ్లీకి, మరో దానిలో రోహిత్ శర్మకు విశ్రాంతినివ్వడం ద్వారా కొన్ని ప్రయోగాలు చేసే అవకాశాలు కూడా లేకపోలేదని సమాచారం. ఏదిఏమైనా, నాలుగో టీ-20ని కూడా దక్కించుకోవలన్న పట్టుదలతో ఉన్న టీమిండియా, అందుకు తగిన వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటుందనేది వాస్తవం.
కొత్త పేసర్లతో కివీస్ దాడి..
న్యూజిలాండ్ జట్టు నాలుగో టీ-20లో కొత్త పేసర్లను బరిలోకి దించడం ద్వారా భారత బ్యాటింగ్ లైనప్‌పై దాడికి దిగడం ఖాయంగా కనిపిస్తున్నది. నిజానికి ఆ జట్టు ఫ్రంట్‌లైన్ ఫాస్ట్ బౌలర్లు గాయాలతో బాధపడుతున్నారు. ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్యూసన్, మాట్ హెన్రీలో ఎవరు అందుబాటులో ఉంటారన్నది అనుమానంగానే ఉంది. వీరి స్థానాల్లో కేల్ జమీసన్, స్కాట్ కూగెలిన్, హామిష్ బెనెట్ చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కూగెలిన్, బెనెట్ ఇది వరకు జట్టుకు ప్రాతినిథ్యం వహించినప్పటికీ, ఆతర్వాత అవకాశాలు కోల్పోయారు. మరోసారి అవకాశం దక్కితే సత్తా నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాగా, జమీసన్‌కు ఇంత వరకూ జట్టులో అవకాశం రాలేదు. అతను అంతర్జాతీయ కెరీర్‌ను భారత్‌తోనే ప్రారంభించవచ్చని అంటున్నారు.