క్రీడాభూమి

అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌పై కనే్నసిన భారత జట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోచఫ్‌స్ట్రూమ్ (దక్షిణాప్రికా), ఫిబ్రవరి 3: అండర్-19 ప్రపంచ కప్ పోటీల్లో నాలుగు సార్లు చాంపియన్లుగా నిలిచిన భారత జూనియర్ క్రికెట్ జట్టు ఈ దఫా మళ్లీ ఫైనల్స్‌కు చేరుకునేందుకు తహతహలాడుతోంది. ఈక్రమంలోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుతో మంగళవారం తొలి సెమీ ఫైనల్‌లో తలపడుతోంది. ఈ టోర్నీలో మొత్తం సెమీస్‌కు నాలుగు జట్లు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇందులో అటు భారత్, ఇటు పాకిస్తాన్ ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఒక ఓటమిని కూడా ఎదుర్కోకుండా అజేయ జట్లుగా ఉన్నాయి. క్వార్టర్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను భారత జట్టు ఓడించగా, ఆఫ్గనిస్తాన్‌ను పాక్ జట్టు ఓడించడం జరిగింది. ఇప్పటి వరకు పాక్ జట్టు ప్రదర్శనలో కెప్టెన్ రోహైల్ నాజిర్ అద్భుత ఆటతీరును కనబరిచాడు. ఐతే ఎలాంటి టోర్నీలో నైనా భారత-పాకిస్తాన్ జట్లు పరస్పరం ఢీకొంటే ఆటగాళ్లు అమితమైన ఒత్తిడికి గురై ప్రతిష్టాత్మకంగా పోరాడడం జరుగుతుంటుంది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో జరిగిన ప్రదర్శన క్రమంలో ఇరు జట్లు అమితమైన ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి. ఈపోటీలో మంచి ఆటతీరును కనబరిస్తే ఎవరైనా రాత్రికిరాత్రే హీరోగా మారిపోతారన్న విషయం ఆటగాళ్లందరికీ తెలుసు. కాగా ‘ఈ పోటీని మేము ఓ సాధారణ మ్యాచ్‌గానే భావించి, ఒత్తిడికి గురికాకుండా ఆడతామ’ని పాక్ ఓపెనర్ మహమ్మద్ హురైరా ధీమా వ్యక్తం చేశాడు. ఇలావుండగా గత సెప్టెంబర్‌లో జరిగిన ఆసియాకప్ పోటీల్లో విజేతగా నిలిచిన భారత్ పాక్ జట్టును ఓడించింది. ఈక్రమంలో ఇరు జట్ల బలాబలాలను పరిశీలిస్తే భారత జట్టుదే పైచేయిగా కనిపిస్తోంది.
ప్రియం గార్గ్ నేతృత్వంలోని భారత జట్టులో ఓపెనర్ యశశ్వి జైస్వాల్ ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్‌ల్లో మూడు అర్ధ సెంచరీలతో జట్టుకు వెనె్నముకలా మారాడు. మిగిలిన బ్యాట్స్‌మన్ ప్రదర్శన అంతగా ఆకట్టుకోలేదు. పేసర్లు కార్తిక్ త్యాగి, అథర్వ అంకొలేకర్, లెగ్‌స్పిన్నర్ రవి బిష్ణోయ్ బ్యాటింగ్‌లో సైతం సంతృప్తికరంగా రాణిస్తున్నారు. అలాగే పాక్ జట్టులో ఫాస్ట్ బౌలర్లు అబ్బాడ్స్ అఫ్రిది, మహమ్మద్ అమీర్‌ఖాన్, తాహిర్ హుస్సేన్ భారత బ్యాట్స్‌మన్‌కు ఈ టోర్నీలో మంచి సవాలు విసిరే అవకాశం ఉంది.