క్రీడాభూమి

ఆంధ్రా 97.. పంజాబ్ 108

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటియాల, ఫిబ్రవరి 4: రంజీట్రోఫీ 2019-20లో భాగంగా మంగళవారం పంజాబ్-ఆంధ్రా జట్ల మధ్య ప్రారంభమైన మ్యాచ్‌లో ఒకేరోజు 24 వికెట్లు పడ్డాయ. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు ఆంధ్రా జట్టు 97 పరుగులకు కుప్పకూలింది. జట్టులో బోడపాటి సుమంత్ (22) అత్యధిక స్కోరర్‌గా నిలవగా, కేవీ శశికాంత్ (20), షోయాబ్ మహ్మద్ ఖాన్ (16, నాటౌట్), కరణ్ షిండే (16), కెప్టెన్ రికీ భుయ్ (11) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌కు దిగిన పంజాబ్ జట్టు సైతం అదే ఆటతీరుతో 35.2 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటై, 11 పరుగుల ఆధిక్యం సంపాదించింది. పంజాబ్ బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ మణిదీప్ సింగ్ (23) టాప్ స్కోర ర్‌గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో వందలోపే ఆలౌటైన ఆంధ్రా జట్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే తీరు ఆట ప్రద ర్శించింది. ప్రస్తుతం 31 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది.