క్రీడాభూమి

హమ్మయ్య.. కివీస్ గెలిచింది..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హామిల్టన్, ఫిబ్రవరి 5: హమ్మయ్యా.. మొత్తానికి టీమిండియాతో జరిగిన మొదటి వనే్డలో సొంతగడ్డపై కివీస్ విజయం సాధించింది. భారీ లక్ష్యాన్ని మరో 11 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో గెలుపును అందుకుంది. 348 పరుగులను ఛేదించడం న్యూజిలాండ్ జట్టుకు ఇదే మొద టిసారి కావడం విశేషం. దీంతో గత టీ20 సిరీస్‌ను 5-0 తేడా తో కోల్పోయన బ్లాక్‌క్యాప్స్ జట్టుకు ఈ గెలుపు ఊరట నిచ్చినట్లయంది. మరోవైపు భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుం చినా బౌలింగ్, ఫీల్డింగ్‌లో చేసిన పొరపాట్లతో కోహ్లీసేన ఓట మి తప్పలేదు.
నిరాశ పరిచిన కుర్రాళ్లు..
అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండి యాకు యువ ఓపెనర్లు పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ 50 పరుగుల శుభారంభాన్ని అందించినా, వ్యక్తిగ తంగా తొలి వనే్డలో మాత్రం ఆకట్టుకోలేక పోయారు. 50 పరుగుల వద ద పృథ్వీ షా (20), మరో నాలుగు పరుగులకే మయాంక్ అగర్వాల్ (32) పెవిలియన్ చేరి నిరాశ పరిచారు.
మళ్లీ ఆ ముగ్గురే..
భారత జట్టు 54 పరుగులకే ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోగా, కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు శ్రేయాస్ అయ్యర్ బాధ్యతగా ఆడారు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూనే జట్టు స్కోరుని వేగం గా పెంచారు. ఈ క్రమంలోనే కెప్టెన్ కోహ్లీ (51) 61 బంతుల్లో 58 వనే్డ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్లో నే ఇష్ సోదీకి వికెట్ల ముందు దొరికిపోయాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 105 పరుగుల విలువైన భాగస్వామ్యా న్ని అందించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన లోకేష్ రాహుల్‌తో కలిసి అయ్యర్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు రాహుల్ సైతం తనదైన శైలిలో ఆడుతూ కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. మరోవైపు సెంచరీకి సమీపిస్తున్న అయ్యర్ శాంత్నార్ బౌలింగ్ 83 పరుగుల వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయ్యర్ లాంగ్ ఆన్ మీదుగా కొట్టిన బంతిని కొలిన్ డీగ్రాండ్ హోం జారవిడిచాడు. మరోవైపు రాహుల్ సైతం శాంత్నార్ వేసిన 43వ ఓవర్‌లో 40 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తిచేసుకోగా, అ దే ఓవర్‌లో 5వ బంతికి శ్రేయాస్ అయ్యర్ (103) తన కెరీర్‌లో తొలి సెంచరీని సాధించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే సౌథీ బౌలింగ్‌లో అనవసర బంతిని ఆడిన శ్రేయాస్ శాంత్నార్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికీ భారత్ 296 పరుగులకు 4 వికెట్లను కోల్పోయంది. మరో 4 ఓవర్లు మాత్రమే మిగిలి ఉండడంతో లోకేష్ రాహుల్ (88, నాటౌట్) కేదార్ జాదవ్ (26)తో కలిసి చెలరేగి ఆడాడు. వీరిద్దరూ కలిసి మరో వికెట్ కోల్పోకుండా చివరి వరకు ఆడడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయ 347 పరుగులు చేసింది.
గెలవాలనే కసితో..
ప్రత్యర్థి తమ ముందుంచిన భారీ లక్ష్యానికి న్యూజిలాండ్ జట్టు ఏమాత్రం కంగారు పడకుండా ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టింది. ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్, హెన్రీ నికోల్స్ సమయో చితంగా ఆడుతూ జట్టు బాధ్యతను తమ భుజాన వేసుకున్నా రు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 85 పరుగుల భాగస్వా మ్యాన్ని జోడించారు. ఈ క్రమంలో గుప్టిల్ (32)ను శార్దుల్ ఠాకూర్ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే క్రీజులోకి వచ్చిన టామ్ బ్లండెల్ (9) కుల్దీప్ బౌలింగ్‌లో ముందుకొచ్చిన ఆడే ప్రయత్నం చేయగా, రాహుల్ స్టంపౌట్ చేశాడు. మరి కొద్దిసేపటికే అర్ధ సెంచరీ పూర్తి చేసుకొని దూకుడుగా కనిపించిన నికోల్స్ (78)ని కోహ్లీ రనౌట్ చేశాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు 171 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయ కష్టాల్లో పడింది.
ఆదుకున్న సీనియర్..
ఆ తర్వాత క్రీజులో కొనసాగుతున్న సీనియర్ ఆటగాడు రాస్ టేలర్, కెప్టెన్ టామ్ లాథమ్‌తో కలిసి భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వీరిద్దరూ బౌండరీలే లక్ష్యంగా ఆడుతూ జట్టు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే రాస్ టేలర్ 45 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేసుకోగా, 38 బంతుల్లో టామ్ లాథమ్ (69) అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయతే కుల్దీప్ వేసిన అద్భుత బంతికి లాథమ్ క్యాచ్ అవుట్‌గా క్రీజును వదిలాడు.
చిగురించిన ఆశలు..
లాథమ్ అవుట్ అయ్యాక, ఆ వెంటనే జేమ్స్ నీషమ్ (9), కొలిన్ డీగ్రాండ్ హోం (1) అవుట్ కావడంతో అప్పటివరకు విజయంపై నమ్మకం లేని భారత్‌కు ఒక్కసారిగా మళ్లీ ఆశలు చిగురించాయ. అయతే టీమిండియా ఆశలపై రాస్ టేలర్ నీళ్లు చల్లాడు. 45 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసిన టేలర్ (109, నాటౌట్) మరో 28 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. మిచెల్ శాంత్నార్ (12, నాటౌట్) సహకారంతో 11 బంతులు మిగిలి ఉండగానే జట్టును గెలిపించాడు. దీంతో మూడు వనే్డ మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0 తేడాతో కోహ్లీ సేనపై ఆధిక్యం సంపాదించింది.
56 ఎక్స్‌ట్రాలు..
ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల బౌలర్లు 56 ఎక్స్‌ట్రాలు ఇవ్వడం విశేషం. మొదట బౌలింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 27 పరుగులను ఎక్స్‌ట్రాల రూపంలో ఇవ్వగా, అనంతరం భారత్ 29 పరుగులను ఎక్స్‌ట్రాల రూపంలోనే ఇచ్చింది. ఒక రకంగా టీమిండియా ఓటమికి ఇదీ ఒక కారణమే.

స్కోర్ బోర్డు..
భారత్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సీ) లాథమ్ (బీ) కొలిన్ డీగ్రాండ్ హోం 20, మయాంక్ అగర్వాల్ (సీ) టామ్ బ్లండెల్ (బీ) సౌథీ 32, విరాట్ కోహ్లీ (బీ) ఇష్ సోదీ 51, శ్రేయాస్ అయ్యర్ (సీ) శాంత్నార్ (బీ) సౌథీ 103, లోకేష్ రాహుల్ (నాటౌట్) 88, కేదార్ జాదవ్ (నాటౌట్) 26.
ఎక్స్‌ట్రాలు: 27 మొత్తం: 347 (50 ఓవర్లలో 4 వికెట్లకు..)
వికెట్ల పతనం: 1-50, 2-54, 3-156, 4-292
బౌలింగ్: టిమ్ సౌథీ 10-1-85-2, హమీష్ బెనె్నట్ 10-0-77-0, కొలిన్ డీగ్రాండ్ హోం 8-0-41-1, జేమ్స్ నీష మ్ 8-0-52-0, శాంత్నార్ 10-0-58-0, సోదీ 4-0-27-1.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: మార్టిన్ గుప్టిల్ (సీ) కేదార్ జాదవ్ (బీ) శార్దూల్ ఠాకూర్ 32, హెన్రీ నికోల్స్ (రనౌట్) కోహ్లీ 78, టామ్ బ్లండెల్ (స్టంప్) రాహుల్ (బీ) కుల్దీప్ యాదవ్ 9, రాస్ టేలర్ (నాటౌట్) 109, టామ్ లాథమ్ (సీ) షమీ (బీ) కుల్దీప్ యాదవ్ 69, జేమ్స్ నీషమ్ (సీ) కేదార్ జాదవ్ (బీ) షమీ 9, కొలిన్ డీగ్రాండ్ హోం (రనౌట్) శ్రేయాస్ అయ్యర్/కోహ్లీ 1, మిచెల్ శాంత్నార్ (నాటౌట్) 12.
ఎక్స్‌ట్రాలు: 29 మొత్తం: 348 (48.1 ఓవర్లలో 6 వికెట్లు..)
వికెట్ల పతనం: 1-85, 2-109, 3-171, 4-309, 5-328, 6-331.
బౌలింగ్: జస్ప్రీత్ బుమ్రా 10-1-53-0, మహ్మద్ షమీ 9.1-0-63-1, శార్దూల్ ఠాకూర్ 9-0-80-1, రవీంద్ర జడేజా 10-0-64-0, కుల్దీప్ యాదవ్ 10-0-84-2.

*చిత్రాలు.. ..ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రాస్ టేలర్ (109, నాటౌట్)
*శ్రేయాస్ అయ్యర్ (103)