క్రీడాభూమి

గోవాపై చెనె్నయన్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫటోర్డా, డిసెంబర్ 20: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ టైటిల్‌ను చెనె్నయిన్ క్లబ్ కైవసం చేసుకుంది. ఆదివారం అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో చెనె్నయిన్‌ను అదృష్టం వరించగా, గోవాను దురదృష్టం లక్ష్మీకాంత్ కట్టిమణి రూపంలో వెంటాడింది. మెన్డోజా వలెన్షియా మ్యాచ్ చివరి క్షణాల్లో కీలక గోల్ చేసి చెనె్నయిన్‌ను గెలిపించాడు. మ్యాచ్ ఆరంభమైన మరుక్షణం నుంచే ఇరు జట్లు పూర్తి రక్షణాత్మక విధానాన్ని అనుసరించడంతో వేగాన్ని పుంజుకోలేదు. ఆరంభంలో ఇరు జట్ల ఆటగాళ్ల తీరు అభిమానుల సహనానికి పరీక్షగా నిలిచింది. ఒకరి గోల్‌పోస్టుపై మరొకరు తీవ్ర స్థాయిలో దాడులకు ఉపక్రమించకపోవడం, బంతిని సాధ్యమైనంత ఎక్కువ సేపు తమ ఆధీనంలోనే ఉంచుకోవడానికి ప్రయత్నించడం టైటిల్ పోరును నిరాసక్తంగా మార్చేసింది. ప్రథమార్ధంలో ఒక్క గోల్ కూడా నమోదు కాకపోవడంతో, ద్వితీయార్ధంపై ప్రేక్షకులు ఆశలు వదులుకున్నారు. మ్యాచ్ డ్రా ముగిసి, పెనాల్టీ షూటౌట్ అనివార్యమవుతుందన్న అభిప్రాయం వ్యక్తంమైంది. అయితే, ద్వితీయార్ధంలో ఆట ప్రథమార్ధానికి భిన్నంగా కొనసాగింది. ఇరు జట్ల ఆటగాళ్లు గోల్స్ కోసం తీవ్రంగా పోటీపడ్డారు. గోల్స్ చేసి ఆధిక్యాన్ని సంపాదించడానికి ప్రాధాన్యం ఇవ్వడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. 54వ నిమిషంలో పెలిసరీ చేసిన గోల్‌తో చెనె్నయిన్ బోణీ చేసింది. అయితే, మరో నాలుగు నిమిషాల్లోనే తొంగొసియెమ్ హవోకిప్ ద్వారా గోవాకు ఈక్వెలైజర్ లభించింది. ఇరు జట్లు చెరొక గోల్ చేసిన తర్వాత దూకుడును కొంత తగ్గించాయి. ఒకానొక దశలో మ్యాచ్ డ్రా అవుతుందేమోనన్న అనుమానం వ్యక్తమైంది. 87వ నిమిషంలో మతెవూ జొఫ్రె చేసిన గోల్‌తో గోవా 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లగా, మ్యాచ్ ముగింపు దశకు చేరడంతో ఫలితం ఏ విధంగా ఉంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. అయితే, 90వ నిమిషంలో చెనె్నయిన్‌ను గోవా ఆటగాడు కట్టిమణి కరుణించాడు. చెనె్నయిన్ గోల్ పోస్టు వద్ద బంతిని ఆపడానికి చేసే ప్రయత్నంలో అతను పొరపాటున ఓన్ గోల్ చేశాడు. దీనితో చెనె్నయిన్‌కు ఈక్వెలైజర్ లభించింది. అనుకోకుండా లభించిన ఈ గోల్‌తో ఆ జట్టు ఆటగాళ్లు రెట్టించిన ఉత్సాహంతో దాడులను కొనసాగించారు. కొన్ని క్షణాల వ్యవధిలోనే మెన్డోజా వలెన్షియా ద్వారా ఆ జట్టుకు అత్యంత కీలకమైన మూడో గోల్ లభించింది. మ్యాచ్ డ్రా అవుతుందని అప్పటి వరకూ ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను తారుమారు చేస్తూ చెనె్నయిన్ విజయభేరి మోగించింది. టైటిల్‌ను కైవసం చేసుకుంది.
విజయవంతం
మొత్తం ఎనిమిది జట్లు పోటీపడిన ఐఎస్‌ఎల్ విజవయంతమైంది. ప్రతి మ్యాచ్‌కీ సగటున 25,000 మంది ప్రేక్షకులు హాజరుకావడం విశేషం. గ్రూప్ దశలో 56 మ్యాచ్‌లు జరిగాయి. పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాలను ఆక్రమించిన జట్లు సెమీస్‌కు చేరుగా, మిగతా నాలుగు జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. సెమీస్ చేరిన జట్లలో గోవా ఫుట్‌బాల్ క్లబ్, డిఫెండింగ్ చాంపియన్ అట్లెటికో డి కోల్‌కతా, చెనె్నయిన్, ఢిల్లీ డైనమోస్ జట్లు ఉన్నాయి. నార్త్‌ఈస్టర్న్ ఫుట్‌బాల్ క్లబ్, ముంబయి సిటీ, పుణె సిటీ, కేరళ బ్లాస్టర్స్ జట్లు నిష్క్రమించారు. రెండు సెమీ ఫైనల్స్ బెస్ట్ఫా టూ విధానంలో జరిగాయి. అంటే ఒక్కో సెమీ ఫైనల్‌లో రెండేసి మ్యాచ్‌లు ఉంటాయి. చెనె్నయిన్, గోవా జట్లు ఫైనల్ చేరితే, కోల్‌కతా, ఢిల్లీ ఇంటిదారి పట్టాయి. ఫైనల్‌లో చెనె్నయిన్ విజయభేరి మోగించగా, కీలక గోల్ చేసిన మొన్డోజా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో అతను మొత్తం 13 గోల్స్ చేయడం విశేషం.