క్రీడాభూమి

బుష్ ఫైర్ మ్యాచ్‌లో పాంటింగ్ ఎలెవన్ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా కార్చిచ్చు కారణంగా నష్టపోయన వారిని ఆదుకునేందుకు నిర్వహించిన బుష్ ఫైర్ చారిటీ మ్యాచ్ ఆకట్టుకుంది. ఆదివారం మెల్‌బోర్న్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో గిల్‌క్రిస్ట్ ఎలెవన్ జట్టుపై పాంటింగ్ ఎలెవన్ 1 పరుగు తేడాతో విజయం సాధించింది. అంతకు ముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాంటింగ్ జట్టు 10 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయ 104 పరుగులు చేసిం ది. ఓపెనర్లు జస్టిన్ లాంగర్ (6), మాథ్యూ వేడ్ (16) పరుగులు చేయగా, కెప్టెన్ రికీ పాంటింగ్ (26), బ్రియాన్ లారా (30) పరుగులు చేసి రిటైర్డ్ అవుట్‌గా పెవిలియన్ చేరారు. ఈ మ్యాచ్‌లో లారా, పాంటింగ్ కొట్టిన సిక్సర్లు అభిమానులను ఆకట్టుకున్నాయ. కోట్నీ వాల్ష్, యువరాజ్ సింగ్, అండ్రూ సైమండ్స్ ఒక్కో వికెట్ తీశారు.
వాట్సన్ జోరు..
ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన గిల్‌క్రిస్ట్ జట్టులో కెప్టెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ (17) పరుగులు చేసి లూక్ హడ్జ్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. మరో ఓపెనర్ షేన్ వాట్సన్ (30) 9 బంతుల్లోనే 2 బౌండరీలు 3 సిక్సర్లు కొట్టి రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్రాడ్ హాడ్జ్ (0) బ్రెట్ లీ బౌలింగ్‌లో పరుగులేమీ చేయకుండానే అవుట్ కాగా, యువరాజ్ సింగ్ (2) కూడా అదే ఓవర్‌లో క్రీజును వదిలాడు. చివర్లో అండ్రూ సైడంబ్స్ (29) చెలరేగి రిటైర్డ్ అవుట్‌గా క్రీజును వదలగా, కామెరూన్ స్మిత్ (5), నిక్ రివాల్ట్ (9) నాటౌట్‌గా నిలిచారు. అప్పటికే ఓవర్లు పూర్తి కావడంతో గిల్‌క్రిస్ట్ జట్టు 1 పరుగు తేడాతో పరాజయం పాలైంది.
పెర్రీ చాలెంజ్.. మాస్టర్ బ్లాస్టర్ బౌండరీ
పాంటింగ్ ఎలెవన్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన టీమిం డియా మాజీ ఆటగాడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఎలిసె పెర్రీ సరదాగా విసిరిన చాలెంజ్‌ను స్వీకరించాడు. పాంటింగ్ ఎలెవన్ జట్టు ఇన్నింగ్స్ తర్వాత విరామ సమయంలో పెర్రీ బౌలింగ్‌లో సచిన్ దాదాపు ఐదున్నర ఏళ్ల తర్వాత మైదానంలో బ్యాట్ పట్టుకొని, 10వ నెంబర్ జెర్సీతో కనిపించడంతో అభిమానులు సచిన్.. సచిన్ అంటూ నినాదాలు చేశారు. అయతే పెర్రీ బౌలింగ్‌లో ఆడిన మొదటి బంతికే సచిన్ బౌండరీ కొట్టగా, మిగతా బంతులను తనదైన శైలిలో ఆడాడు. ఓవర్ పాటు సచిన్ బ్యాటింగ్ కొనసాగగా, అభిమానుల నినాదాలు అంతేసేపు మైదానమంతా మార్మోగాయ. అంతకుముందు పెర్రీ సచిన్ వద్ద పలు సలహాలు, సూచనలు తీసుకుంది. ఈ బుష్ ఫైర్ మ్యాచ్‌లో సచిన్ ఆటగాడిగానే బరిలోకి దిగాల్సి ఉండగా, భుజం గాయం కారణంగా వైద్యుల సూచనల మేరకు ఆటకు దూరంగా ఉన్నాడు.
*చిత్రాలు.. గిల్‌క్రిస్ట్ ఎలెవన్, పాంటింగ్ ఎలెవన్ జట్లు *సచిన్ టెండూల్కర్