క్రీడాభూమి

కొనసాగుతున్న జైత్రయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెర్త్: మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ను మట్టికరిపించిన హర్మన్ సేన, సోమవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నూ టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా మహిళా జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయ 142 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌కు అనారోగ్యం కారణంగా స్టార్ ఓపెనర్ స్మృతీ మంధాన దూరం కావడంతో షఫాలీ వర్మతో కలిసి వికెట్ కీపర్ తనియ భటియా ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయతే జట్టు స్కోరు 16 పరుగుల వద్ద తనియ భటియా (2) సల్మా ఖాతూన్ బౌలింగ్‌లో స్టంపౌట్ గా వెనుదిరిగింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జెమీమా రోడ్రీగ్స్‌తో కలిసి షఫాలీ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడింది. ఆకాశమే హద్దుగా బౌండరీలతో చెలరేగింది. మరోవైపు జెమీ మా సైతం నిలకడగా ఆడుతూ జట్టు స్కోరును పెంచే ప్రయ త్నం చేశారు. అయతే దూకుడుగా కనిపించిన షఫాలీ వర్మ (39) పన్నా ఘోష్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా క్రీజును వదిలింది. అప్పటికీ భారత్ 53 పరుగులు చేయగా 39 పరు గులు షఫాలీ చేసినవే కావడం గమనార్హం. అనంతరం క్రీజు లోకి అడుగుపెట్టిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (8) తక్కువ స్కోరుకే వెనుదిరగ్గా, దీప్తిశర్మ (11), రీచా ఘోష్ (14) కూడా నిరాశ పరిచారు. ఇక చివరి మూడు ఓవర్లలో క్రీజులో నిలిచిన వేదా కృష్ణమూర్తి (20, నాటౌట్) మూడు బౌండరీలతో అల రించగా, శిఖా పాండే (7) చివరి వరకు క్రీజులో నిలిచింది. దీంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయ 142 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో కెప్టెన్ సల్మా ఖాతూన్, పన్నా ఘోష్ చెరో రెండు వికెట్లను పడగొట్టారు.
ఆదిలోనే ఎదురుదెబ్బ..
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ మహిళా జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయ 124 పరుగులు మాత్రమే చేసి 18 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. బంగ్లా బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ ముర్షిదా ఖాతూన్ (30), వికెట్ కీపర్ నిగర్ సుల్తానా (35) మాత్రమే చెప్పుకోదగిన స్కోర్లు సాధించడంతో ఓటమి తప్పలేదు. టీమిండియా బౌలర్లలో పూనమ్ యాదవ్ 3 వికెట్లు తీయగా, దీప్తి శర్మ, అరుంధతీ రాయ్ రెండేసి వికెట్లు, రాజేశ్వరి గైక్వాడ్ 1 వికెట్ పడగొట్టారు. షఫాలీ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

స్కోర్ బోర్డు..
భారత్ ఉమెన్ ఇన్నింగ్స్: తనియ భటియా (స్టంప్) నిగర్ సుల్తానా (బీ) సల్మా ఖాతూన్ 2, షఫాలీ వర్మ (సీ) సల్మా సుల్తానా (బీ) పన్నా ఘోష్ 39, జెమీమా రోడ్రీగ్స్ (రనౌట్) నిహిదా అక్తర్/నిగర్ సుల్తానా 34, హర్మన్‌ప్రీత్ కౌర్ (సీ) రుమనా అహ్మద్ (బీ) పన్నా ఘోష్ 8, దీప్తి శర్మ (రనౌట్) ఫర్గానా హక్/నిగర్ సుల్తానా 11, రిచా ఘోష్ (సీ) నమిదా అక్తర్ (బీ) సల్మా ఖాతూన్ 14, వేదా కృష్ణమూర్తి (నాటౌట్) 20, శిఖా పాండే (నాటౌట్) 7.
ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: 142 (20 ఓవర్లలో 6 వికెట్లకు)
వికెట్ల పతనం: 1-16, 2-53, 3-78, 4-92, 5-111, 6-113.
బౌలింగ్: జహనరా ఆలమ్ 4-0-33-0, సల్మా ఖాతూన్ 4-0-25-2, నిహిదా అక్తర్ 4-0-34-0, పన్నా ఘోష్ 4-0-25-2, రుమా నా అహ్మద్ 2-0-8-0, ఫాతీమా ఖాతూన్ 2-0-16-0.
బంగ్లాదేశ్ ఉమెన్ ఇన్నింగ్స్: షమీమా సుల్తానా (సీ) దీప్తి శర్మ (బీ) శిఖా పాండే 3, ముర్షిదా ఖాతూన్ (సీ) రీచా ఘోష్ (బీ) అ రుంధతీ రెడ్డి 30, సంజ్దా ఇస్లాం (సీ) తనియ భటియా (బీ) పూనమ్ యాదవ్ 10, నిగర్ సుల్తానా (సీ) అరుంధతీ రెడ్డి (బీ) గైక్వాడ్ 35, ఫర్గానా హక్ (సీ) తనియ భటియా (బీ) అరుంధతీ రెడ్డి 0, ఫాహీమా ఖాతూన్ (సీ) షఫాలీ వర్మ (బీ) పూనమ్ యాదవ్ 17, జహనరా ఆలమ్ (స్టంప్) తనియ భటియా (బీ) పూనమ్ యాదవ్ 10, రుమానా అహ్మద్ (బీ) శిఖా పాండే 13, సల్మా ఖాతూన్ (బ్యాటింగ్) 2, నిహీదా అక్తర్ (బ్యాటింగ్) 2.
ఎక్ సట్రాలు: 2, మొత్తం: 124 (20 ఓవర్లలో 8 వికెట్లకు)
వికెట్ల పతనం: 1-5, 2-44, 3-61, 4-66, 5-94, 6-106, 7-108, 8-121.
బౌలింగ్: దీప్తి శర్మ 4-0-32-0, శిఖా పాండే 4-0-14-2, రాజేశ్వరి గైక్వాడ్ 4-0-25-1, అరుంధతీ రెడ్డి 4-0-33-2, పూనమ్ యాదవ్ 4-0-18-3.

*చిత్రం... ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో షఫాలీ వర్మ