క్రీడాభూమి

పేస్‌కే ఎఐటిఎ ఓటు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 11: తెలుగు వీరుడు సాకేత్ మైనేనీకి రియో ఒలింపిక్స్‌లో ఆడే అవకాశం చేతికి అందినట్టే అంది జారిపోయింది. అఖిల భారత టెన్నిస్ సంఘం (ఎఐటిఎ) సాకేత్‌ను పక్కకుపెట్టి, వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్‌వైపే మొగ్గుచూపింది. రియోలో తనకు భాగస్వామిగా సాకేత్ ఉండాలని కోరుతూ ఎఐటిఎకు రోహన్ బొపన్న లేఖ రాసిన విషయం తెలిసిందే. సహజంగా మేజర్ టోర్నీల్లో భాగస్వామి ఎవరు ఉండాలనేది ఆటగాళ్లకే విడిచిపెడతారు. ఈ కారణంగానే పేస్ కంటే సాకేత్ మెరుగైన అభ్యర్థిగా బొపన్న అభిప్రాయపడ్డాడు. అతనిని ఒలింపిక్స్‌లో తన డబుల్స్ భాగస్వామిగా ఎంపిక చేయాలని ఎఐటిఎను కోరాడు. కానీ, అతని అభ్యర్థనను టెన్నిస్ సంఘం పట్టించుకోలేదు. సాకేత్‌ను కాదని పేస్‌కే అవకాశాన్ని కట్టబెట్టింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ‘టాప్-10’లో ఉన్న వారికి ఒలింపిక్స్‌లో నేరుగా స్థానం దక్కుతుంది. పురుషుల డబుల్స్‌లో బొపన్న ‘టాప్-10’లో ఉన్నాడు. మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నది. ఆమె మిక్స్‌డ్ డబుల్స్‌లో తన పార్ట్‌నర్‌గా బొపన్న ఉండాలని ఎఐటిఎను కోరింది. సాకేత్ విషయంలో ఆటగాడి అభిప్రాయాన్ని పట్టించుకోని ఎఐటిఎ సెలక్టర్లు మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా డిమాండ్‌కు తలవంచారు. ఆ విభాగంలో బొపన్న ఆమెతో కలిసి పోటీపడతారని ప్రకటించారు. అదే విధంగా సానియాకు మిక్స్‌డ్ డబుల్స్‌లో జోడీగా ప్రార్థన తొంబారేను ఎంపిక చేశారు.
బొపన్నకు ఎఐటిఎ షాక్
ఎఐటిఎ నిర్ణయం బొపన్నకు షాకిచ్చింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో డబుల్స్ విభాగంలో పేస్‌తో కలిసి ఆడాల్సిందిగా బొపన్నకు ఎఐటిఎ సూచించింది. అయితే, ఆ ప్రతిపాదనను తిరస్కరించిన బొపన్న తనకు డబుల్స్ భాగస్వామిగా మహేష్ భూపతి ఉండాలని పట్టుబట్టి పంతం నెగ్గించుకున్నాడు. దీనితో గత్యంతరం లేని పరిస్థితుల్లో అంతర్జాతీయ టెన్నిస్‌లో అంతగా అనుభవం లేని విష్ణువర్ధన్‌తో కలిసి పేస్ బరిలోకి దిగాల్సి వచ్చింది. బొపన్న, భూపతి జోడీ రెండో రౌండ్‌లో జూలియెన్ బెనెటూ, రిచర్డ్ గాస్క్వెట్ జోడీ చేతిలో ఓటమిపాలైంది. పేస్, విష్ణువర్ధన్ పోరాటం కూడా రెండో రౌండ్‌తోనే ముగిసింది. మైఖేల్ లోద్రా, జో విల్‌ఫ్రైడ్ సొంగా జోడీ చేతిలో ఓడిన వీరు ఇంటిదారి పట్టారు. అయితే, అప్పుడు తిరస్కరించిన పేస్‌తోనే బొపన్న ఇప్పుడు జతకట్టాల్సి రావడం విశేషం.

లియాండర్ పేస్, రోహన్ బొపన్న (ఫైల్ ఫొటో)