క్రీడాభూమి

విజేత బార్సిలోనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యొకహమా, డిసెంబర్ 20: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) ఆధ్వర్యంలో జరిగిన క్లబ్ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌ను స్పెయిన్ దిగ్గజం బార్సిలోనా కైవసం చేసుకుంది. ఆదివారం భారీగా తరలి వచ్చిన అభిమానుల సమక్షంలో జరిగిన ఫైనల్‌లో ఈ జట్టు 3-0 తేడాతో అట్లెటికో రివర్ ప్లేట్‌ను చిత్తుచేసింది. సౌరెజ్ రెండు గోల్స్ సాధించి, బార్సిలోనాను విజయపథంలో నడిపాడు. మెస్సీ ఒక గోల్ చేశాడు. టైటిల్ పోరులో ఫేవరిట్‌గా బరిలోకి దిగిన బార్సిలోనా తన స్థాయికి తగినట్టే ఆడింది. దూకుడుగా ఆడనివ్వకుండా ప్రత్యర్థి ఆటగాళ్లను ఒకవైపు కట్టడి చేస్తూనే మరోవైపు అవకాశం దొరికిన ప్రతిసారీ గోల్స్ కోసం ప్రయత్నించింది. బార్సిలోనా ఆటగాళ్లను అడ్డుకోవడానికి రివర్ ప్లేట్ డిఫెండర్లు సర్వశక్తులు ఒడ్డాల్సి వచ్చింది. 36వ నిమిషంలో రివర్ ప్లేట్ రక్షణ వలయాన్ని ఛేదించిన బార్సిలోనా సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ తొలి గోల్ చేశాడు. ప్రథమార్ధంలోనే 1-0 ఆధిక్యం లభించడంతో బార్సిలోనా వ్యూహాత్మకంగా ఆడేందుకు ప్రయత్నించింది. గోల్స్ చేయడం కంటే, రివర్ ప్లేట్ ఆటగాళ్లు తమ డిఫెన్స్ పరిధిని దాటకుండా చూడడానికి ప్రాధాన్యతనిచ్చింది. 49వ నిమిషంలో సౌరెజ్ చేసిన గోల్ బార్సిలోనాను 2-0 ఆధిక్యంలో నిలబెట్టింది. మెరుపువేగంతో దూసుకొచ్చిన అతను ప్రత్యర్థి ఆటగాళ్లు తన కదలికలను అర్థం చేసుకునే కంటే ముందుగానే గోల్ పోస్టు వరకూ దూసుకెళ్లాడు. చక్కటి కిక్‌తో గోల్ సాధించాడు. ఈ గోల్ నమోదైన తర్వాత రివర్ ప్లేట్ గోల్స్ కోసం ప్రయత్నించడం, బార్సిలోనా అడ్డుకోవడం మధ్య మ్యాచ్‌లో 19 నిమిషాలు గడిచాయి. 68వ నిమిషంలో సౌరెజ్ మరోసారి దాడికి ఉపక్రమించి, అద్భుతమైన గోల్ సాధించాడు. అతని ‘డబుల్’తో 3-0 ఆధిక్యానికి చేరుకున్న బార్సిలోనా అదే తేడాతో మ్యాచ్‌ని ముగించింది. ఆ జట్టు వరల్డ్ క్లబ్ కప్ టైటిల్ సాధించడం ఇది మూడోసారి.
హిరోషిమాకు మూడో స్థానం
ఫైనల్ చేరడంలో విఫలమైనప్పటికీ స్థానిక సాన్‌ఫ్రెసే హిరోషిమా మూడో స్థానాన్ని ఆక్రమించి అభిమానులకు ఊరటనిచ్చింది. గాంగ్జూ ఎవర్‌గ్రాండెతో జరిగిన క్లాసిఫికేషన్ మ్యాచ్‌ని ఈ జట్టు 2-1 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ నాలుగో నిమిషంలోనే జోస్ పాలిన్హో చక్కటి గోల్ చేసి గాంగ్జూని ఆధిక్యంలో నిలబెట్టాడు. ఆ తర్వాత హిరోషిమా ఈక్వెలైజర్ కోసం చేసిన ప్రయత్నాలను గాంగ్జూ డిఫెండర్లు సమర్థంగా అడ్డుకున్నారు. ఫలితంగా మొదటి ప్రధమార్ధంలో మరో గోల్ నమోదు కాలేదు. ద్వితీయార్ధంలోనూ చాలాసేపు ఇదే పరిస్థితి కొనసాగింది. అయితే, 70వ నిమిషంలో సాంటోస్ డగ్లస్ ద్వారా హిరోషిమాకు ఈక్వెలైజర్ లభించింది. మరో 13 నిమిషాల్లోనే అతను మరో గోల్ చేశాడు. ఆతర్వాత గోల్స్ నమోదుకాలేదు. డగ్లస్ రెండు గోల్స్ హిరోషిమాను మూడో స్థానంలో నిలబెట్టాయి.