క్రీడాభూమి

వార్నర్ సూపర్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బసెటెర్, జూన్ 12: ముక్కోణపు వనే్డ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ని ఆస్ట్రేలియా 36 పరుగుల తేడాతో గెల్చుకుంది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ శతకంతో రాణించగా, ఆరు వికెట్లకు 288 పరుగులు సాధించిన ఆస్ట్రేలియా ఆ తర్వాత దక్షిణాఫ్రికాను 47.4 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌట్ చేసింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాకు ఇది రెండో విజయంకాగా దక్షిణాఫ్రికాకు రెండో పరాజయం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా వార్నర్ అండగా నిలిచాడు. 48 పరుగుల స్కోరువద్ద ఆరోన్ ఫించ్ (13)ని ఇమ్రాన్ తాహిర్ క్లీన్ బౌల్డ్ చేయగా, ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఉస్మాన్ ఖాజాతో కలిసి వార్నర్ రెండో వికెట్‌కు 136 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించాడు. అతను 120 బంతులు ఎదుర్కొని, 11 ఫోర్లు, రెండు సిక్సర్లతో 109 పరుగులు చేసి, వేన్ పార్నెల్ బౌలింగ్‌లో హషీం ఆమ్లా క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. ఉస్మాన్ ఖాజా (59), స్టీవెన్ స్మిత్ (52 నాటౌట్) అర్ధ శతకాలతో రాణించగా, జార్జి బెయిలీ (11), మిచెల్ మార్ష్ (10), మాథ్యూ వేడ్ (24) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. చివరిలో స్టీవెన్ స్మిత్‌తో కలిసి జేమ్స్ ఫాల్క్‌నెర్ (1) నాటౌట్‌గా నిలవగా, ఆస్ట్రేలియా 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ఇమ్రాన్ తాహిర్ 45 పరుగులకు రెండు వికెట్లు కూల్చగా, కేల్ అబోట్, రబదా, వేన్ పార్నెల్, ఆరోన్ ఫాంగిసో తలా ఒక వికెట్ పడగొట్టారు.
ఆస్ట్రేలియాను ఓడించేందుకు 289 పరుగులు సాధించాల్సి ఉండగా, 35 పరుగుల వద్ద క్వింటన్ డికాక్ (19)ను తొలి వికెట్ రూపంలో దక్షిణాఫ్రికా కోల్పోయింది. హషీం ఆమ్లా (60), ఫఫ్ డు ప్లెసిస్ (63) క్రీజ్‌లో ఉన్నప్పుడు దక్షిణాఫ్రికా విజయం సాధ్యమనే అభిప్రాయం ఏర్పడింది. ఎబి డివిలియర్స్ (39), జీన్ పాల్ డుమినీ (41) కూడా దక్షిణాఫ్రికాను ఆదుకోవడానికి విశ్వప్రయత్నం చేశారు. కానీ, అవసరమైన రన్‌రేట్‌ను అందుకునే ప్రయత్నంలో ఒత్తిడికి గురైన దక్షిణాఫ్రికా లోయర్ మిడిల్ ఆర్డర్ వికెట్లు పారేసుకుంది. ఫరాన్ బెహర్డిన్ (4), వేన్ పార్నెల్ (3), కేల్ అబోట్ (1), ఆరోన్ ఫాంగిసో (3), కాగిసో రబదా (3) సింగిల్ డిజిట్స్‌కే పరిమితంకాగా, దక్షిణాఫ్రికా మరో 14 బంతులు మిగిలి ఉండగానే, 252 పరుగుల స్కోరువద్ద ఆలౌటైంది. అప్పటికి ఇమ్రాన్ తాహిర్ ఆరు పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లు ఆడం జంపా, మైఖేల్ స్టార్క్, జొష్ హాజెల్‌వుడ్ తలా మూడేసి వికెట్లు పడగొట్టారు.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా: 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 288 (డేవిడ్ వార్నర్ 109, ఉస్మాన్ ఖాజా 59, స్టీవెన్ స్మిత్ 52 నాటౌట్, ఇమ్రాన్ తాహిర్ 2/45).
దక్షిణాఫ్రికా: 47.4 ఓవర్లలో 252 ఆలౌట్ (హషీం ఆమ్లా 60, ఫఫ్ డు ప్లెసిస్ 63, ఎబి డివిలియర్స్ 39, జెపి డుమినీ 41, మిచెల్ స్టార్క్ 3/43, జొహ్ హాజెల్‌వుడ్ 3/52, ఆడం జంపా 3/52).

చిత్రం సెంచరీ హీరో డేవిడ్ వార్నర్