క్రీడాభూమి

కౌల్టర్ నైల్ స్థానంలో బోలాండ్‌కు చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెర్త్, డిసెంబర్ 22: వెస్టిండీస్‌తో ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న బాక్సింగ్ డే టెస్టులో ఆడే ఆస్ట్రేలియాకు స్కాట్ బోలండ్ రానున్నాడు. ఫాస్ట్ బౌలర్ నాథన్ కౌల్టర్ నైల్ గాయపడడంతో జట్టుతో చేరాల్సిందిగా బోలాండ్‌ను ఆసీస్ సెలక్టర్లు ఆదేశించారు. 36 ఏళ్ల బోలాండ్ 2011-12 సీజన్‌లో విక్టోరియా జట్టులోకి అడుగుపెట్టాడు. టెస్టు క్రికెట్‌లో ఆడే అవకాశం ఇప్పటి దాకా దక్కించుకోలేకపోయిన అతను 27 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో ఆడి 72 వికెట్లు పడగొట్టాడు. బిగ్ బాష్ టోర్నీలో పెర్త్ స్కార్చర్స్ తరఫున అడుతున్నప్పుడు ఫీల్డింగ్ చేస్తూ కౌల్టర్ నైల్ గాయపడ్డాడు. అతని కుడి భుజానికి గాయమైందని, కనీసం రెండు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారని స్కార్చర్స్ జట్టు ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, హోబర్ట్‌లో జరిగిన మొదటి టెస్టుకు స్టాండ్‌బై ఆటగాడిగా బోలాండ్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే, మ్యాచ్ ఆరంభానికి ముందు ప్రకటించిన తుది 11 మంది జాబితాలో అతనికి స్థానం దక్కలేదు. ప్రతిష్ఠాత్మక బాక్సింగ్ డే టెస్టులో అతనికి తుది జట్టులో ఆడే అవకాశం దక్కుతుందా లేదా అన్నది వేచి చూడాలి.