క్రీడాభూమి

యూరో 2016 ఫుట్‌బాల్ ఇటలీ శుభారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లియాన్, జూన్ 14: యూరో 2016 ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఇటలీ శుభారంభం చేసింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న బెల్జియంతో జరిగిన తొలి మ్యాచ్‌ని 2-0 తేడాతో గెల్చుకుంది. వ్యూహాత్మకంగా ఆడిన ఇటలీ ఎక్కువ సమయాన్ని డిఫెన్స్‌కు కేటాయించి, అవకాశం దొరికినప్పుడు దాడులకు ఉపక్రమించింది. ఈ క్రమంలోనే 32వ నిమిషంలో ఇమాన్యుయెల్ గియాచెరినీ ఇటలీకి తొలి గోల్‌ను అందించాడు. ఆతర్వాత మరింత జాగ్రత్తగా ఆడిన ఇటలీ ప్రథమార్ధాన్ని మరో గోల్ లేకుండా ముగించింది. ద్వితీయార్ధంలోనూ ప్రత్యర్థికి గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా పటిష్టమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకొని, దానిని సమర్థంగా కాపాడుకుంది. 90 నిమిషాలు ముగిసే సమయానికి మరో గోల్ నమోదు కాలేదు. ఇంజురీ టైమ్ రెండో నిమిషంలో గ్రాజియానో పెల్లే చేసిన గోల్‌తో ఇటలీ 2-0 తేడాతో విజయం సాధించింది.
క్లార్క్ ఓన్ గోల్
పారిస్: రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ ఆటగాడు సియారన్ క్లార్క్ ఓన్ గోల్ చేసి స్వీడన్‌ను రక్షించాడు. యూరో కప్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో తలపడిన ఐర్లాండ్, స్వీడన్ రక్షణాత్మకంగా ఆడుతూ, ఒకరి అవకాశాలను మరొకరు అడ్డుకున్నారు. మ్యాచ్ 48వ నిమిషంలో ఐర్లాండ్‌కు వెస్ హూలాహన్ తొలి గోల్‌ను అందించాడు. స్వీడన్ ఈక్వెలైజర్ కోసం తీవ్రంగా పోరాడుతున్న సమయంలోనే క్లార్క్ కొట్టిన బంతి తన జట్టు గోల్ పోస్టులోకే దూసుకెళ్లింది. ఫలితంగా స్వీడన్‌కు ఈక్వెలైజర్ లభించింది. ఆతర్వాత గోల్స్ నమోదు కాలేదు. మ్యాచ్‌ని స్వీడన్ 1-1 డ్రా చేసుకుంది.
సహనానికి పరీక్ష!
చెక్ రిపబ్లిక్, డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్ మధ్య జరిగిన మ్యాచ్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. దాడులు, ప్రతిదాడులు లేకుండా కేవలం డిఫెన్స్‌తో ఇరు జట్ల ఆటగాళ్లు సమయాన్ని దొర్లించారు. మ్యాచ్ ముగింపు దశకు చేరుకోగా, డ్రా అనివార్యమని అంతా అనుకున్నారు. అయితే, 87వ నిమిషంలో గెరార్డ్ పైక్ గోల్ చేసి స్పెయిన్‌ను గెలిపించాడు. అతను గోల్ చేయడాన్ని మినహాయిస్తే, ఈ మ్యాచ్ ఎవరినీ ఆకట్టుకోలేకపోయింది.