క్రీడాభూమి

24న కోచ్ ఎంపిక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 14: అంతటా ఉత్కంఠ రేపుతున్న భారత క్రికెట్ జట్టు కోచ్ ఎంపిక ఈనెల 24న జరిగే అవకాశం ఉంది. భారత క్రికెట్ మండలి (బిసిసిఐ) పాలక మండలి కీలక సమావేశం ధర్మశాలలో ఆరోజున జరగనుంది. డంకన్ ఫ్లెచర్‌తో కాంట్రాక్టు ముగిసిన తర్వాత, జట్టు డైరెక్టర్ రవి శాస్ర్తీకే కోచ్‌గా అదనపు బాధ్యతలను అప్పగించిన బిసిసిఐ చాలాకాలం నెట్టుకొచ్చింది. ఇటీవల కాలంలో బోర్డు వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగుతుండగా, సుప్రీం కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కోచ్‌తోపాటు, సపోర్టింగ్ స్ట్ఫా కోసం దరఖాస్తులు చేసుకోవాలని బిసిసిఐ ప్రకటించింది. ఆ ప్రకటనకు పలువురు భారత మాజీ క్రికెటర్ల నుంచేగాక, విదేశీయుల నుంచి కూడా అనూహ్య స్పందన వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 57 మంది కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. టీమిండియాకు డైరెక్టర్‌గా వ్యవహరించిన రవి శాస్ర్తీ, జాతీయ సెలక్షన్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్ వంటి హేమాహేమీలు రంగంలోకి దిగారు. కాగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వడపోసి, కోచ్‌గా సేవలు అందించే అర్హతలున్న వ్యక్తిని ఎంపిక చేసేందుకు బిసిసిఐ పాలక మండలి సమావేశం కానుంది. అయితే, అదే సమావేశంలో నిర్ణయం తీసుకుంటారా లేక జాబితాను కుదించి, అర్హులుగా అనిపించిన ఇద్దరుముగ్గురి పేర్లను ఎంపిక చేసుకొని, వారితో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారా అన్నది ఇంకా తెలియడం లేదు. మొత్తం మీద భారత క్రికెట్ జట్టుకు కొత్త కోచ్ ఎవరన్నది ఆసక్తిని రేపుతోంది.

కుంబ్లే గుగ్లీ!
ముంబయి: భారత మాజీ స్పిన్నర్ అనీల్ కుంబ్లే చాలా మంది మాజీ క్రికెటర్లపై ఒకేసారి గుగ్లీని సంధించాడు. రవి శాస్ర్తీ, సందీప్ పాటిల్ తదితరులు భారత కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోగా, ఎవరూ ఊహించని విధంగా అనీల్ కుంబ్లే కూడా రంగంలోకి దిగాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)కి అనుబంధంగా పని చేస్తున్న క్రికెట్ కమిటీకి కుంబ్లే ప్రస్తుతం చీఫ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో పది వికెట్లు కూల్చిన బౌలర్‌గా లీనేకర్ రికార్డును సమం చేసిన కుంబ్లే కెరీర్‌లో 132 టెస్టులు, 271 వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడాడు. టెస్టుల్లో 2,506 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 100 (నాటౌట్). వనే్డల్లో 938 పరుగులు చేసిన అతని అత్యధిక స్కోరు 26 పరుగులు. టెస్టు ఫార్మెట్‌లో అతను 40,850 బంతులు వేశాడు. ప్రపంచ టెస్టు చరిత్రలో ముత్తయ్య మురళీధరన్ (44,039) తర్వాత అత్యధిక బంతులు వేసిన బౌలర్‌గా రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించుకున్నాడు. 619 వికెట్లు పడగొట్టిన అతని ఉత్తమ బౌలింగ్ విశే్లషణ 74 పరుగులకు పది వికెట్లు. వనే్డల్లో 337 వికెట్లు సాధించిన కుంబ్లే అత్యుత్తమంగా 12 పరుగులిచ్చి ఆరు వికెట్లు కూల్చాడు. అంతర్జాతీయ కెరీర్‌ను ముగించిన తర్వాత బిసిసిఐలో పలు కీలక బాధ్యతలను పోషించిన కుంబ్లే సమర్థుడిగా పేరుతెచ్చుకున్నాడు. కోచ్ పదవికి అవసరమైన అన్ని అర్హతలు, లక్షణాలు అతనికి ఉన్నాయి. రేసులో కుంబ్లే కూడా చేరడంతో ఆ పదవి ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.