క్రీడాభూమి

ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాకు భారత రెజ్లర్ ప్రాతినిధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జూన్ 17: భారత సంతతికి చెందిన మల్లయోధుడు (రెజ్లర్) వినోద్ కుమార్ దహియా ఈ ఏడాది ఆగస్టులో జరిగే రియో ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. 66 కిలోల గ్రీకో-రోమన్ విభాగంలో అతను ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించాడు. హర్యానాలోని ఖాండా గ్రామానికి చెందిన వినోద్ (31) ఏడాది క్రితమే ఆస్ట్రేలియా పౌరుడిగా మారాడని, తొలిసారి మెగా ఈవెంట్‌కు అర్హత సాధించిన అతను ఒలింపిక్స్‌లో సత్తా చాటుకునేందుకు సిద్ధమయ్యాడని అధికారిక వెబ్‌సైట్ పేర్కొంది. అల్జీరియాలో జరిగిన ఆఫ్రికన్/ఓషియానియా ఒలింపిక్ అర్హత పోటీల్లో వినోద్ కుమార్ దహియా రజత పతకాన్ని కైవసం చేసుకుని రియో బెర్తు ఖరారు చేసుకున్నాడు. సోదరుల అడుగు జాడల్లో నడచి ఎనిమిదేళ్ల ప్రాయంలోనే రెజ్లింగ్‌లో ప్రతిభ చాటుకున్న వినోద్ శక్తిసామర్ధ్యాలను గ్రహించి కుటుంబ సభ్యులు 1998లో అతడిని మరింత తర్ఫీదు నిమిత్తం న్యూఢిల్లీలోని మహాబలి సత్పాల్ రెజ్లింగ్ అకాడమీకి పంపారు. ఆ తర్వాత నాలుగేళ్ల పాటు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటుకోవడంతో పాటు మన దేశంలో ఎంతో ప్రజాదరణ పొందుతున్న డర్ట్ రెజ్లింగ్ పోటీల్లో కూడా పాల్గొన్నాడు. 2010లో ఆస్ట్రేలియాకు వలస వెళ్లిన వినోద్ అక్కడ రెజ్లింగ్ ఆస్ట్రేలియా మాజీ అధ్యక్షుడు కుల్దీప్ బస్సీ ఆధ్వర్యంలోని యునైటెడ్ రెజ్లింగ్ క్లబ్‌లో శిక్షణ ప్రారంభించాడు. విక్టోరియాలో ఉంటున్న వినోద్ కుమార్ ఇప్పటివరకూ ఆరుసార్లు జాతీయ చాంపియన్‌షిప్‌లు సాధించడంతో పాటు ఆస్ట్రేలియా కప్, కాన్‌బెర్రా కప్ తదితర టోర్నమెంట్లలో ఎన్నో పతకాలను గెలుచుకున్నాడు. అంతేకాకుండా ఈ ఏడాది మార్చి నెలలో న్యూజిలాండ్‌లో జరిగిన ఓషియానియా చాంపియన్‌షిప్స్‌లో తొలిసారి గ్రీన్ అండ్ గోల్డ్‌కు ప్రాతినిధ్యం వహించి పసిడి పతకాన్ని కూడా కైవసం చేసుకున్నాడు.