క్రీడాభూమి

క్లింట్ డెంప్సీ వివాదం.. నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 18: ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరిగిన చాంపియన్స్ ట్రోఫీ హాకీ ఫైనల్‌లో పెనాల్టీ షూటౌట్ సందర్భంగా వివాదం తలెత్తింది. డానియెల్ బీయెల్ కొట్టిన బంతిని భారత గోల్‌కీపర్ శ్రీజేష్ సమర్థంగా అడ్డుకున్నాడు. అయితే, ఆస్ట్రేలియా ఆటగాళ్లు రీ ప్లేకు డిమాండ్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అతనికి మరో అవకాశం ఇవ్వాలని వీడియో అంపైర్ ప్రకటించడంతో భారత కోచ్ రోలాంట్ అల్ట్‌మన్స్ తీవ్ర స్థాయిలో ప్రతిఘటించాడు. అయితే, రెండోసారి బంతిని కొట్టే అవకాశాన్ని బీయెల్ సద్వినియోగం చేసుకున్నాడు. మ్యాచ్ 3-1గా ఆస్ట్రేలియా పక్షాన నిలవగా, ఫలితం వెలువడిన వెంటనే భారత్ అధికారికంగా ఫిర్యాదు చేసింది. పెనాల్టీ షూటౌట్‌లో బీయెల్‌కు రెండో అవకాశం ఇవ్వడాన్ని తప్పుపట్టారు. దీనితో కొంత సేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. మ్యాచ్ ఫలితాన్ని అధికారికంగా వెల్లడించే కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు అధికారులు ప్రకటించారు. ట్రోఫీలను మైదానం నుంచి స్టేడియం భవనంలోకి తరలించారు. టోర్నీ ఉన్నతాధికారులు, రిఫరీలు సమావేశమై సుమారు గంట సేపు చర్చించిన తర్వాత బీయెల్‌కు రెండో అవకాశం ఇవ్వడం సమంజసమేనని నిర్ధారించారు. బీయెల్ పెనాల్టీ షూటౌట్‌ను కొడుతున్నప్పుడు శ్రీజేష్ అతని ఏకాగ్రతను దెబ్బతీసే విధంగా ప్రవర్తించాడని పేర్కొన్నారు. శ్రీజేష్ ఉద్దేశపూర్వకంగా అలా చేయకపోయి ఉండవచ్చని, కానీ, దాని వల్ల ఆటగాడి ఏకాగ్రత దెబ్బతింది కాబట్టి అతనికి మరో అవకాశం ఇవ్వడంలో తప్పులేదని అంటూ ఆస్ట్రేలియాను విజేతగా ప్రకటించారు. అప్పటికే ప్రేక్షకులంతా వెళ్లిపోవడంతో స్టేడియం ఖాళీ అయింది. దీనితో అధికారులు హడావుడిగా బహుమతుల ప్రదాన కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

చిత్రం భారత హాకీ కోచ్ రోలాంట్ అల్ట్‌మన్స్