క్రీడాభూమి

ఓపెనర్ల శతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్మింగ్‌హామ్, జూన్ 25: ఓపెనర్లు అలెక్స్ హాలెస్, జాసన్ రాయ్ అజేయ శతకాలతో రాణించి, రికార్డు పుస్తకాల్లో స్థానం సంపాదించగా, శ్రీలంకతో జరిగిన రెండో వనే్డ ఇంటర్నేషనల్‌ను ఇంగ్లాండ్ పది వికెట్ల తేడాతో గెల్చుకుంది. మొదటి వనే్డ టైగా ముగియగా, రెండో వనే్డలో తొలుత బ్యాటింగ్ చేసిన 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 254 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ లక్ష్యాన్ని 34.1 ఓవర్లలో వికెట్ నష్టం లేకుండా ఛేదించింది. టెస్టు సిరీస్‌లో లంకను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లాండ్ వనే్డ సిరీస్‌ను కూడా గెల్చుకోవాలన్న పట్టుదలతో బరిలోకి దిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక బ్యాట్స్‌మెన్‌లో వికెట్‌కీపర్ దినేష్ చండీమల్ (52), ఉపుల్ తరంగ (53) అర్ధ శతకాలు సాధించారు. కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ 44 పరుగులతో రాణించారు. ఓపెనర్ కుశాల్ పెరెరా 37 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో లియామ్ ప్లంకెట్, అదిల్ రషీద్ చెరి రెండు వికెట్లు కూల్చారు. కాగా, లంకను ఓడించేందుకు 255 పరుగులు సాధించాల్సి ఉండగా, లక్ష్యాన్ని ఓపెనర్లు జాసన్ రాయ్, అలెక్స్ హాలెస్ ఇంకా 95 బంతులు మిగిలి ఉండగానే, సునాయాసంగా ఛేదించారు. లంక బౌలింగ్‌ను ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఎదుర్కొన్న వీరు వనే్డల్లో మొదటి వికెట్‌కు అజేయంగా 256 పరుగులు జోడించి, అత్యుత్తమ పార్ట్‌నర్‌షిప్స్‌లో ఐదో స్థానాన్ని ఆక్రమించారు. ఇంగ్లాండ్ పది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసే సమయానికి జాసన్ రాయ్ 112 (95 బంతులు, ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు), అలెక్స్ హాలెస్ 133 (110 బంతులు, 10 ఫోర్లు, ఆరు సిక్సర్లు) నాటౌట్‌గా ఉన్నారు.

వనే్డ క్రికెట్‌లో మొదటి వికెట్‌కు
అత్యుత్తమ భాగస్వామ్యాలు
286: ఉపుల్ తరంగ (109), సనత్ జయసూర్య (152) (శ్రీలంక/ 2006లో ఇంగ్లాండ్‌పై), 282: ఉపుల్ తరంగ (133), తిలకరత్నే దిల్షాన్ (144) (శ్రీలంక/ 2011లో జింబాబ్వేపై), 274: జేమ్స్ మార్షల్ (161), బ్రెండన్ మెక్‌కలమ్ (166) (న్యూజిలాండ్/ 2008లో ఐర్లాండ్‌పై), 258: సౌరవ్ గంగూలీ (111), సచిన్ తెండూల్కర్ (146) (్భరత్/ 2002లో కెన్యాపై), 256 (అజేయంగా): జాసన్ రాయ్ (112 నాటౌట్), అలెక్స్ హాలెస్ (133 నాటౌట్) (ఇంగ్లాండ్/ తాజా మ్యాచ్‌లో శ్రీలంకపై). మొదటి వికెట్‌కు 250 లేదా అంతకు మించి పరుగులు చేసిన జోడీ జాబితాలో సౌరవ్ గంగూలీ, సచిన్ తెండూల్కర్ రెండు పర్యాయాలు కనిపిస్తారు. 1998లో కొలంబోలో శ్రీలంకలో జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరూ తొలి వికెట్‌కు 252 పరుగులు జోడించారు. ఆ మ్యాచ్‌లో గంగూలీ 109, సచిన్ 128 చొప్పున పరుగులు చేశారు.

చిత్రం శ్రీలంకతో వనే్డలో మొదటి వికెట్‌కు అజేయంగా 256 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన
ఇంగ్లాండ్ ఓపెనర్లు అలెక్స్ హాలెస్, జాసన్ రాయ్