క్రీడాభూమి

నా హోం వర్క్ పూర్తయ్యేది కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 25: పాఠశాలలో చదువుతున్న రోజుల్లో హోం వర్క్ చేయడం ఎప్పుడూ తనకు భారంగానే తోచేదని, అది ఎన్నటికీ పూర్తయ్యేది కాదని భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన అతను చిన్నారులతో కలిసి కొంత సేపు సరదాగా గడిపాడు. తన చిన్నతనంలో జరిగిన పలు సంఘటనలను గుర్తుచేసుకున్నాడు. తీరిక సమయాల్లో ఎక్కువగా క్రికెట్ ఆడేవాడినని చెప్పాడు. ఇలావుంటే, ప్రీమియర్ ఫస్టల్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నీ కోసం ఎఆర్ రెహ్మాన్ సంగీతం సమకూర్చిన పాటకు కోహ్లీ స్టెప్పులేసి అభిమానులను అలరించాడు. ఈ టోర్నీలో ఎనిమిది జట్లు తలపడనున్నాయి. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, గోవా, కొచ్చి, హైదరాబాద్, బెంగళూరు జట్లు పాల్గొంటున్న ఫస్టల్ లీగ్ వచ్చేనెల 15 నుంచి 24వ తేదీ వరకు జరుగుతుంది.