క్రీడాభూమి

న్యూజిలాండ్‌పై సఫారీ మహిళా జట్టు గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆక్లాండ్, జనవరి 25: ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన మొదటి వనే్డలో సఫారీ మహిళా జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయ 259 పరుగులు చేసింది. సుజీ బేట్స్ (53), కేటీ పెర్కిన్స్ (78) అర్ధ సెంచరీలతో రాణించారు. అయబొంగ ఖాక, మసబట క్లాస్ చెరో 3 వికెట్లు తీయగా, షబ్నీమ్ ఇస్మాయల్ 2, క్లో ట్రయాన్ 1 వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా మహిళా జట్టు మరో 9 బంతులు మిగిలి ఉండగానే కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయ విజయం సాధించింది. ఓపెనర్ లిజెల్లీ లీ (99), మరో ఓపెనర్ లారా వాల్‌వర్త్ (91, నాటౌట్) అర్ధ సెంచరీలతో రాణించి, జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.