స్పాట్ లైట్

లేబర్ ఓటుకు ఎర?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన బ్రిటన్ ప్రధాని ధెరీసామే ముందు అనేక సవాళ్లు పొంచి ఉన్నాయి. అసలు ఎంత మంది బ్రెగ్జిట్‌కు ఆనుకూలంగా ఉన్నారో తెలియాలంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఒక్కటే మార్గమని భావించిన ధెరీసా అందుకు అన్ని విధాలుగా సిద్ధమవుతున్నారు. బ్రెగ్జిట్ నుంచి బ్రిటన్ నిష్క్రమణకు అధికారికంగా నాంది పలికిన ఆమెకు ఇప్పుడు ఎన్నికల్లో నెగ్గడం ఓ పెద్ద సమస్యగా మారింది.
ఐరోపా యూనియన్‌తో చేతులు కలిపి ప్రస్తుత పరిస్థితుల్లో బ్రెగ్జిట్ ప్రయోజనాలను సాధించుకునే సానుకూల రాజకీయ వాతావరణం లేనందునే ధెరీసా మధ్యంతర ఎన్నికల పాచిక విసిరారు. ఇప్పుడు తాజాగా జనంలోకి మరింతగా చొచ్చుకెళ్లేందుకు ఎన్నికల మేనిఫెస్టోతో తాయిలాల వర్షం కురిపిస్తున్నారు. కొత్త విధానాలు, కార్మికులకు లబ్ధి చేకూర్చే వ్యూహాలతో రూపొందించిన ఈ మేనిఫెస్టో ఆమెకు ఎన్నికల్లో ఎంత మేరకు విజయం చేకూర్చి పెడుతుందన్నది అనుమానమేనని నిపుణులు అంటున్నారు. ఇప్పటి వరకూ లేబర్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓటర్లను కన్సర్వేటివ్ పార్టీవైపు తిప్పుకోవాలంటే వారికి పూర్తి స్థాయిలో లబ్ధిని చేకూర్చడమే మార్గమన్నది ధెరీసా ఆలోచన. ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోయినా కార్మికులకు ఎలాంటి నష్టం ఉండదన్న ధీమాను ఇప్పటి నుంచే కలిగించాలన్న ఆమె వ్యూహాన్ని లేబర్ పార్టీ ఏ మేరకు తట్టుకుంటుందో కూడా చూడాల్సిందే.