స్పాట్ లైట్

ఇక ముళ్లబాటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి అన్న చందంగా మారిన బ్రిటన్ సాధారణ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తమ మైనారిటీ ప్రభుత్వాన్ని అధికారంలో కొనసాగించుకోవడానికి ప్రధాని థెరిసామే నానాతంటాలు పడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. గతంలోవున్న మెజారిటీ కూడా తగ్గిపోవడంతో ఇప్పుడు ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన పార్టీతో చేతులు కలిపితే తప్ప, అధికారంలో మనుగడ సాగించలేని దుస్థితి రావడంతో.. రాజీబాట పట్టడమే అనివార్యమనుకున్న థెరిసా ఆ దిశగానే ముందుకు సాగుతున్నారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం డెమొక్రాటిక్ యూనియనిస్ట్ పార్టీ (డియుపి)తో దాదాపు బిలియన్ పౌండ్ల ఒప్పందాన్ని కుదుర్చుకోవడమే. ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంటే తప్ప తమకు చెందిన పదిమంది చట్టసభ సభ్యుల మద్దతు ఉండదని డియుపి తెగేసి చెప్పడంతో థెరిసా మేకు ఈ రాజీబాట అనివార్యంగా మారింది. అంటే ఉత్తర ఐర్లాండ్‌కు భారీమొత్తంలో నిధులు కల్పిస్తే తప్ప మద్దతిచ్చేది లేదని డియుపి తేల్చిచెప్పడంతో అసలు థెరిసా ప్రభుత్వం ఎన్నాళ్లుంటుందన్నది అనుమానాస్పదంగానే మారింది. దాదాపు రెండు వారాలపాటు విస్తృత స్థాయిలో జరిగిన చర్చలు అంతిమంగా ఈ రాజీకి దారితీశాయి. ఇంత భారీగా ఆర్థిక సాయాన్ని పొందినప్పటికీ డియుపి ప్రభుత్వంలో చేరకుండా బయటినుంచి మద్దతివ్వడానికి మాత్రమే అంగీకరించింది. అంటే, పరిస్థితులు ఏమాత్రం ప్రతికూలంగా మారినా థెరిసాకు మొండిచేయి చూపించే అవకాశాలు చాలా స్పష్టమైనన్న విషయం దీనిబట్టి తెలుస్తోంది. పార్లమెంట్‌లో భారీ మెజారిటీ వస్తే ఐరోపా యూనియన్‌తో ముఖాముఖి ఢీకొని బ్రెగ్జిట్ చర్చలను సానుకూలంగా మార్చుకోవాలన్న థెరిసాకు ఇప్పుడు మరోరకమైన పరిస్థితి దాపురించింది. అంటే బలంగా బ్రెగ్జిట్ చర్చలను సాధించాలనుకున్న ఆమెకు ఇప్పుడు మెతక ధోరణిలోనే ముందుకు సాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రారంభంలోనే ఈ ఉత్తర ఐర్లాండ్ పార్టీ ఇంత భారీగా మెలిక పెట్టిందంటే, థెరిసా సారధ్యంలోని కన్జర్వేటివ్ ప్రభుత్వం పూర్తికాలంపాటు అధికారంలో కొనసాగడం ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. ఈ ఉత్తర ఐర్లాండ్ పార్టీ ప్రభుత్వంలో చేరివుంటే దాని మద్దతుపై కొంతలో కొంతైనా విశ్వసనీయత ఉండి ఉండేది. ఏక్షణంలోనైనా తాము మద్దతు ఉపసంహరించుకునే అవకాశం ఉందన్న బలమైన సంకేతాలతోనే డియుపి ఇచ్చిన చేయూత థెరిసాను ఎంతవరకు ముందుకు నడిపిస్తుందన్నది అనుమానమే.