స్పాట్ లైట్

బ్రెగ్జిట్‌పై తొలగని డోలాయమానం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరోపా యూనియన్ నుంచి వైదొలగాలని మెజార్టీ ప్రజలు తీర్పునిచ్చినప్పటికీ దీన్ని వ్యితిరేకించిన వారి సంఖ్యా తక్కువేమీ కాకపోవడంతో బ్రిటన్‌లో ఇంకా డోలాయమాన స్థితి కొనసాగుతూనే ఉంది. మళ్లీ వెనక్కి వెళ్లిపోవాలన్న బలమైన కాంక్ష వ్యక్తమవుతూనే వస్తోందనడానికి తాజాగా జరిగిన ఓ సర్వేనే నిదర్శనం. బ్రెగ్జిట్ ఓటింగ్ జరిగిన నాటి పరిస్థితులు వేరు..ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో తలెత్తిన రాజకీయ వాతావరణం వేరు..! ఇప్పటికిప్పుడు బ్రెగ్జిట్‌పై ఓటింగ్ జరిగితే ఐరోపా యూనియన్‌లోనే ఉండిపోవాలన్న మెజార్టీ తీర్పు రావడం ఖాయమన్న వాదన బలంగా వినిపిస్తోంది. గతంలో జరిగిన ఓటింగ్‌లో బ్రెగ్జిట్‌ను అనుకూలించిన వారి సంఖ్య 54శాతం కాగా, వ్యతిరేకించి వారి సంఖ్య 46శాతం ఉంది. ఇప్పుడు పరిస్థితి తారుమారైందని, ఇప్పటికిప్పుడు ఓటింగ్ జరిగినా ఐరోపా యూనియన్‌లో ఉండిపోవాలని బలంగా తీర్పునిచ్చే వారి సంఖ్య 54శాతం ఉంటుందన్న అభిప్రాయం ఈ సర్వేలో తేటతెల్లమైంది. అలాగే ఐరోపా యూనియన్ నుంచి తప్పుకోవాలనుకునే వారి సంఖ్య 46శాతానికే పరిమితం కావచ్చునని కూడా తేలింది. పంతానికి పోయి ప్రతికూల పరిస్థితుల్లో బ్రెగ్జిట్ చర్చలు జరిపి నష్టాల్ని కొని తెచ్చుకోవడం కంటే కూడా మొత్తానికే ఈ చర్చల్ని నిలిపివేయాలని వాదించేవారి సంఖ్యా పెరుగుతోంది. మొదటి నుంచీ కూడా టోరీలు (అధికార కన్సర్వేటివ్‌లు), లేబర్ పార్టీల మధ్య ఈ వ్యవహారం జటిలంగా మారుతూనే ఉంది. సాధారణ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో ప్రధాని థెరీసామే కొంత మేర తన పట్టును సడలించడంతో ప్రతిపక్ష లేబర్ పార్టీ విమర్శలకూ పదును పెట్టింది. తాజా సర్వేతో బ్రెగ్జిట్‌పై ముందుకా..వెనక్కా అన్నదే బ్రిటన్ తేల్చుకోవాల్సి ఉంటుంది..ప్రధాని థెరీసా ఎంత బలంగా వాదించినా ఆమెకు పార్లమెంట్‌లో పూర్తిస్థాయి మద్దతు లభించే అవకాశం కనిపించడం లేదు. ముఖ్యంగా ఆమెది ఇప్పుడు మైనార్టీ ప్రభుత్వం కావడం వల్ల మద్దతిస్తున్న పార్టీ ఏ మేరకు సహకరిస్తుందన్నది అనుమానమే. పైగా ప్రభుత్వంలో చేరకుండా బయటి నుంచే ఈ పార్టీ చేయూతనివ్వడం పరిస్థితిని మరింత అయోమయంగా మార్చింది. ఇలాంటి పరిస్థితుల్లో జరిగిన సర్వేలో ఐరోపా యూనియన్‌లోనే ఉండేందుకు మెజార్టీ ప్రజలు మొగ్గు చూపడం గందరగోళానికి దారితీసే..్ధరీసా సర్కార్ మనుగడను ప్రశ్నార్థకంగా మార్చే పరిస్థితే..!