స్పాట్ లైట్

మళ్లీ కథ మొదటికి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనామా వేడి పాకిస్తాన్ రాజకీయాల్ని అట్టుడికిస్తోంది. తనపైన, తన కుటుంబ సభ్యులపైనా వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రధాన మంత్రి పదవి నుంచి నవాజ్ షరీఫ్ తప్పుకోవాల్సి రావడంతో పాకిస్తాన్ మరోసారి సైనిక పాలన కిందకి వెళుతుందా? ప్రస్తుత సంక్షోభ పరిస్థితిని అధికార పిఎమ్‌ఎల్ పార్టీ అదుపుచేయగలుగుతుందా? అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. వరుసగా మూడుసార్లు ప్రధాన మంత్రి పదవిని చేపట్టినా పూర్తి కాలం పాటు పదవిలో కొనసాగలేని పరిస్థితినే నవాజ్ షరీఫ్ ఎదుర్కొన్నారు.గతంలో ఉన్నత తీవ్ర స్థాయి రాజకీయ అనిశ్చితి ఇప్పుడు పాకిస్తాన్‌లో లేదన్న వాదన గట్టిగా వినిపిస్తున్నప్పటికీ..పరిస్థితులు అదుపు తప్పితే అణుపాటవం కలిగిన ఈ దేశ పరిస్థితి ఏమిటి? మళ్లీ రాజకీయ అనిశ్చితిలో కూరుకుపోతుందా? ప్రస్తుతం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మనుగడ సాగించగలుగుతుందా అన్నది కూడా ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది.ముఖ్యంగా ఓ పక్క ఉగ్రవాద సమస్యతో అట్టుకుతున్న తరుణంలో రాజకీయ అనిశ్చితి కూడా తోడైతే అణ్వస్త్ర పాటవం కలిగిన పాక్ ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోకైనా జారుకునే ప్రమాదం ఉంటుంది. అవినీతి ఆరోపణల మాట ఎలా ఉన్నా నవాజ్ షరీఫ్ పాలనలో పాకిస్తాన్‌లో కొంత మేర భద్రతాపరమైన ధీమా ఏర్పడిందన్నది వాస్తవం. ఆర్థికంగా వృద్ధిని సాధించడంతో పాటు ఎన్నో సానుకూల పరిణామాలకు నవాజ్ పాలన కేంద్రకంగా నిలిచింది. 2013లో నవాజ్ షరీఫ్ దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు. అంతకు ముందు ఉన్న ప్రభుత్వం కూడా ప్రజలతో ఎన్నుకోబడినదే కావడం వల్ల దేశంలో ప్రజాస్వామ్య పరిస్థితులకు ఎలాంటి ఇబ్బంది లేదన్న సంకేతాలు బలంగానే పాదుగొన్నాయి. అందుకే నవాజ్‌ను అవినీతి ఆరోపణల కారణంగా సుప్రీం కోర్టు తొలగించినా ఒక్కసారిగా పరిస్థితి ఏ మాత్రం చేజారిపోలేదు. నవాజ్ షరీఫ్ అవినీతిపై దుమ్మెతిపోసిన మాజీ క్రికెటర్, తహ్రీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ తాజా అవకాశాన్ని ఎంత మేరకు సద్వినియోగం చేసుకోగలుగుతారన్నది అనుమానమే! పాకిస్తాన్‌లోని నాలుగు రాష్ట్రాల్లో ఓ చోట అధికారంలో ఉన్న ఇమ్రాన్ పార్టీ ఎన్ని అవకాశాలు అందివచ్చినా జాతీయ పార్టీగా ఎదగలేకపోయింది. మరో ఏడాదిలో సాధారణ ఎన్నికలు జరుగుతాయి. అప్పటి వరకూ ఇమ్రాన్ ఖాన్ తన రాజకీయ ప్రాబల్యాన్ని ఏ మేరకు బలోపేతం చేసుకోగలుగుతారు? దేశంలోని ప్రతిపక్షాలన్నింటినీ కూడగట్టుకుని పిఎమ్‌ఎల్‌కు దీటైన శక్తిగా నిలబడగలుగుతారన్నది వేచి చూడాల్సిందే..