స్పాట్ లైట్

ఇరాక్ బాలలకు దిక్కెవ్వరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ యుద్ధంలోనైనా అంతిమంగా మిగిలేది అనాథలేనన్న వాస్తవాన్ని ఇరాక్ ఉదంతాలు రుజువు చేస్తున్నాయి. ఐసిస్ కబ్జాలో వున్న అనేక పట్టణాలను చేజిక్కించుకునే క్రమంలో ఇరాక్ దళాలు జరిపిన దాడులు అంతిమంగా విజయాన్ని చేకూర్చినా వేలాదిమంది చిన్నారుల భవితవ్యం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ అనాథలకు ఆసరా ఎవరు? వారిని ఆదుకునేది ఎవరు? దిక్కూమొక్కూ లేని రీతిలో వారి భవిత సమసిపోవాల్సిందేనా? - అనే ప్రశ్నలు ఒకదాని తర్వాత ఒకటిగా తలెత్తుతున్నాయి. ఉత్తర కొరియాను ఏళ్ల తరబడి ఐసిస్ తన ఆధీనంలో ఉంచుకుంది. ముఖ్యంగా మొసూల్ పట్టణాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు దాదాపు తొమ్మిది నెలల పాటు అహోరాత్రాలు పోరాటం చేయాల్సి వచ్చింది. ఆ క్రమంలో తల్లులకు పిల్లలు దూరమయ్యారు. పిల్లలకు తల్లిదండ్రులు కరువయ్యారు. ఇలా ఎవరికి వారుగా దిక్కూమొక్కూ లేని రీతిలో ఎన్నో జీవితాలు ఆ యుద్ధంలో సమసిపోయాయి. యుద్ధం అంటే ఏమిటో తెలియని బాల్యం అణగారిపోయింది. తుపాకీ మోతల మధ్య చితికిపోయింది. ఇప్పుడు వేలాదిగా వీధిపాలైన ఇరాకీ పిల్లలను ఆదుకునేది ఎవరన్నది అంతులేని ప్రశ్నగానే మిగిలిపోయింది. వీరి జీవితాలను చూస్తే ఎవరి గుండె అయినా కరగాల్సిందే. కన్నీటి పర్యంతం కావాల్సిందే. తమ తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలియక అసలు తమ జీవితాలు ఎలా సాగుతాయో అంతుబట్టక శిథిలాల మధ్యే ఈ బాల్యం సాగుతోంది. ఇంకొందరైతే మొసూల్ పట్టణాన్ని వీడి ఇతర ప్రాంతాలకు పదిమందితో మనం అన్న రీతిలో తరలిపోతే ఇంకొందరు మాత్రం మొసూల్ పట్టణ శిథిలాల మధ్యే మనుగడ సాగిస్తున్నారు. ఎంత దూరం ఉందో తెలియని వెలుతురు కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. చాలామంది పిల్లల మానసిక స్థితి దయనీయంగానే ఉంది. తుపాకీ మోతల మధ్య నెలల తరబడి గడిపిన వారు మానసికంగా చిన్న చప్పుడైనా ఉలిక్కిపడుతున్నారు. మొసూల్‌లో అనాథలుగా ఉన్న వందలాదిమంది పిల్లల్లో చాలామంది పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని మానసికంగా కూడా వారు ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదంటూ ఐక్యరాజ్యసమితి నిపుణులే చెబుతున్నారు. ఎప్పుడైతే మొసూల్‌ను ఇరాకీ దళాలు చేజిక్కించుకున్నాయో అధికారం ప్రభుత్వం చేతికి వచ్చినా అనాథలుగా మిగిలినవారి భవిష్యత్తును ఎవరు పట్టించుకుంటారన్నదే ప్రశ్న. ఇక్కడ ఏ చిన్నారిని పలకరించినా అతడులో చదువుకోవాలన్న ఆశ కనిపిస్తోంది. ‘‘నేను ఇప్పటివరకు స్కూల్‌కే వెళ్లలేదు. చదువుకోవాలని ఉంది. అది నా ఆశ. నా కల’’ అంటూ తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలియని ఓ బాలుడి ఆకాంక్ష ఇది. ఇరాక్ సొరంగాల్లోనూ శిథిలాల్లోనూ ఎందరో పిల్లలు దిక్కూమొక్కూ లేని స్థితిలో ఉన్నారని యునిసెఫ్ గుర్తించింది. ఇలాంటి పిల్లలందర్నీ అక్కున చేర్చుకుని శిబిరాలను ఏర్పాటు చేసినా అవి ఎంతవరకు ఉంటాయి? వారి భవితకు ఎంతమేరకు హామీ ఇస్తాయన్నది చెప్పలేని పరిస్థితి. వీరిలో చాలామందికి మానసికపరమైన బాసటను అందించాల్సిన అవసరం ఉంటుందని, ఇంకొందరి మానసిక స్థితిగతులు ఎప్పుడు మెరుగవుతాయో తెలియని పరిస్థితి నెలకొందని యునిసెఫ్ నిపుణులు చెబుతున్నారు. పరిస్థితులు దారుణంగా ఉన్నా ఈ సవాల్‌ను చేపట్టి ముందుకు వెళ్లగలిగే ఆర్థిక, రాజకీయ, సామాజిక పరమైన బాధ్యతను ఇరాక్ పాలకులు నెరవేర్చగలరా అన్నది సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తోంది.