స్పాట్ లైట్

అమెరికా అధ్యక్షుడా... మజాకా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతడు అడుగుపెడితే అడుగులకు మడుగులొత్తే దేశాలెన్నో! ప్రపంచాన్ని ఆర్థికంగానూ, రాజకీయంగానే కాకుండా అత్యంత శక్తియుక్తులతో శాసిస్తున్న అమెరికా అధ్యక్ష పదవిలో ఎవరున్నా... ఆయన ఎక్కడకు వెళ్లినా ఓ రహస్య అధికార కూటమి నీడలా ముందుంటుంది. అధ్యక్షుడికి అణుమాత్రం అపాయం లేకుండా ముందస్తుగానే అన్నీ చక్కదిద్దుతుంది. ఆయన భద్రతకు, రక్షణకు ఢోకా లేకుండా ధీమాతో కూడిన పరిస్థితులను కల్పిస్తుంది. వివిధ సందర్భాల్లో అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల గురించి విన్నాం. చాపకింద నీరులా సాగే వీరి కార్యకలాపాల గురించి మూడోకంటికీ తెలీదు. అసలీ ఏజెంట్లు ఎలా వుంటారో, వారి కార్యకలాపాలు ఏమిటో ఊహించడమే కష్టం. కొన్ని అరుదైన సందర్భాల్లో మీడియాకు చిక్కిన ఈ సీక్రెట్ ఏజెంట్ల దృశ్యాలివి.

1. న్యూజెర్సీలో ఓ కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా ట్రంప్ కన్నా ముందే అక్కడ తిష్టవేసిన సీక్రెట్ ఏజెంట్లు. ఆయన రావడానికి చాలా ముందే ఆ ప్రాంతాన్నంతా అంగుళం అంగుళం తనిఖీ చేశారు.
2. న్యూయార్క్ సిటీలో మాన్‌హటన్‌లో ఏకంగా ట్రంప్ శాశ్వత నివాసమైన ట్రంప్ టవర్‌లోకే దూసుకెళ్తున్న సీక్రెట్ సిబ్బంది.
3. అవసరమైతే ఈ ఏజెంట్లు వైట్‌హౌస్‌కూడా ఎక్కేస్తారని చెప్పడానికి ఈ చిత్రమే నిదర్శనం. ట్రంప్ జి-20 శిఖరాగ్ర సదస్సుకు వెళ్లడానికి ముందు కెమెరాకు చిక్కిన దృశ్యమిది.
4. ఈ సీక్రెట్ ఏజెంట్లలో రక్షణ, భద్రతా సిబ్బందే కాదు, ఎలాంటి విపత్తునైనా తుత్తునియలు చేయగలిగిన రాటుదేలిన వ్యక్తులూ ఉంటారు. ట్రంప్ ఓ కార్యక్రమానికి హాజరు కావడానికి ముందే అస్తశ్రస్త్రాలతో ఆ ప్రాంతానికి పరుగులు తీస్తున్న ఏజెంట్లు.