స్పాట్ లైట్

మళ్లీ మెర్కెల్ మిరకిల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జర్మనీ పేరు వింటేనే ఏంజిలా మెర్కెల్ పేరు తప్ప మరో పేరు గుర్తురాదు. అంతగా ఆ దేశ రాజకీయాలను అంతర్జాతీయంగా ఆ దేశ ఖ్యాతిని పెంచిన మహిళా నాయకురాలు. అటు బ్రిటన్‌లో థెరిసా మేకు బ్రెగ్జిట్ వ్యవహారం ఏకు మేకై కూర్చున్న వ్యవహారంలో తాజా ఎన్నికల సవాళ్లను అదే స్ఫూర్తితో ఎదుర్కోవాలన్న మెర్కెల్ మిరకిల్ ఎంతగా ఫలిస్తుంది. ఆమె మళ్లీ జర్మనీ చాన్స్‌లర్‌గా పగ్గాలు చేపట్టడానికి ఏమేరకు దోహదం చేస్తుందన్నది సందేహంగానే కనిపిస్తోంది. వచ్చే నెలలో జరగనున్న ఈ ఎన్నికల ఫలితాలను బట్టే ఐరోపా యూనియన్ మనుగడపై ప్రభావం, అదేవిధంగా బ్రెగ్జిట్‌కు సంబంధించి థెరిసా మే చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం నాలుగోసారి జర్మనీ చాన్స్‌లర్ పదవికి ఏంజెలా మెర్కెల్ గట్టిగానే పోటీపడుతున్నారు. ఐరోపా యూనియన్‌లో ఉన్న దేశాల్లో అత్యంత శక్తిమంతమైన దేశం జర్మనీ కావడం వల్ల మెర్కెల్ కాకుండా మరెవరు అధికారంలోకి వచ్చినా దాని పర్యవసానాలు ఈ కూటమిపైనే కాకుండా అంతర్జాతీయంగా కూడా చాలా తీవ్రంగానే ఉంటాయన్నది వాస్తవం. 2005 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్న మెర్కెల్ తనదైన శైలిలోనే దేశ రాజకీయాలను నడిపించారు. అరుదైన ప్రతిభా పాటవాలు రాజకీయ నేర్పు, ఓర్పు కలగలసిన అధినేత్రిగా అందరి నీరాజనాలు అందుకున్నారు. ఐరోపా యూనియన్ చాలా బలంగా ఉంది అంటే బ్రెగ్జిట్ ప్రభావం ఏమీ లేకుండా ఇందులోని ఇతర సభ్య దేశాలు వేటి దారి అవి చూసుకోకుండా సంఘటితంగా ఉన్నాయంటే అందుకు కారణం దానిపై మెర్కెల్ కనబరచిన ప్రభావమేనని చెప్పక తప్పదు. నాలుగోసారి కూడా ఆమె విజయం సాధిస్తే దాదాపు పదహారేళ్లపాటు జర్మనీని పాలించిన హెల్మట్ కౌల్‌తో సరిసమానమైన ఖ్యాతిని మెర్కెల్ సాధించగలుగుతారు. ఓపక్క రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంతర్జాతీయంగా తన పట్టును పెంచుకోవడానికి విశ్వప్రయత్నం చేయడం, అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు సృష్టిస్తూ గందరగోళ పరిస్థితులను రాజేస్తున్న నేపథ్యంలో జర్మనీ మరింత కీలక పాత్రను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాల్సిన పాత్ర ఎంతో ఉంది. ప్రస్తుతం జర్మనీ రాజకీయాలను అక్కడి పరిస్థితులను లోతుగా విశే్లషిస్తే అన్ని విధాలుగానూ మెర్కెల్‌దే పైచేయిగా కనిపిస్తోంది. సిరియా, ఇరాక్, ఉత్తర ఆఫ్రికాలకు చెందిన వలసదారులకు ఆశ్రయాన్ని కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం కారణంగా దేశంలో నిరసనలు తలెత్తడం, దానివల్ల మెర్కెల్ పాపులారిటీ మసకబారిన మాట వాస్తవమే అయినా తాజాగా కొన్ని సానుకూల నిర్ణయాలతోనూ, చర్యలతోనూ ఆమె పుంజుకోగలిగారు. రాజకీయాల మాట ఎలా వున్నా దేశాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో మెర్కెల్ సాధించిన విజయమే నాలుగోసారి అధికార పీఠాన్ని అధిష్టించడాన్ని దోహదం చేసే అవకాశాలు ఉన్నాయన్నది స్పష్టం. ముఖ్యంగా ప్రస్తుత ప్రపంచ అనిశ్చిత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మెర్కెల్ తప్ప జర్మనీ అధికార పదవిని మరెవరు చేపట్టినా అది ఆ దేశం బలహీన పడటానికి, ఇతరత్రా సమస్యల కూపంలో చిక్కుకుపోవడానికే దారితీస్తుందన్న నిపుణుల హెచ్చరికలను విస్మరించడానికి వీల్లేదు. ఈ ఎన్నికల్లో జర్మనీకి గట్టి పోటీ ఇస్తున్నది సోషల్ డెమోక్రటిక్ పార్టీ నాయకుడు మార్టిన్ షుల్జ్ ఏదో అద్భుతం జరిగితే తనదేనన్న బలమైన ఆశతో ఆయనున్నారు. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు జనబాహుళ్యాన్ని పోగుచేసుకుంటూ భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వినూత్న రీతిలో ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఐరోపా యూనియన్ పార్లమెంటు అధ్యక్షుడుగా పనిచేసిన షుల్జ్ ఎంత ప్రయత్నించినా మెర్కెల్ ఆధిక్యతను మాత్రం అధిగమించలేకపోయారు.