శ్రీకాకుళం

పడిగాపులు...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, జూన్ 6: ఇంజినీరింగ్ విద్యతో ఉజ్వల భవిష్యత్ అందిపుచ్చుకోవాలని ఎంతో ఆసక్తితో ఎంసెట్‌లో ర్యాంకులు సాధించినప్పటికీ వెబ్‌కౌనె్సలింగ్ తొలిరోజు అభ్యర్థులకు పడిగాపులు తప్పలేదు. ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రాప్తికి సోమవారం నుంచి వెబ్‌కౌనె్సలింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ సర్వర్లు పనిచేయని కారణంగా సుమారు పదిగంటలు అభ్యర్థులు నిరీక్షించాల్సి వచ్చింది. ఉదయం 9గంటలకు కౌనె్సలింగ్ కేంద్రానికి 1నుంచి 5వేల ర్యాంకు వరకు సాధించిన అభ్యర్థులు రాత్రి 7గంటల వరకు నిరీక్షించడమే కాకుండా తల్లిదండ్రులు కూడా నానా అవస్థలు పడాల్సి వచ్చింది. కౌనె్సలింగ్ కేంద్రం అధికారులు మాత్రం అభ్యర్థులకు ఎటువంటి అవస్థలు కలుగకుండా తొలుత రుసుమును వసూలు చేసి సీరియల్ నెంబర్స్ ఇచ్చారు. 148మంది అభ్యర్థులు రుసుము చెల్లించేందుకు ముందుకు రాగా ఓసీ, బీసీలకు చెందిన 147మంది రూ.1000, ఎస్సీ, ఎస్టీలనుంచి ఒకే అభ్యర్థి రూ.500 చెల్లించారు. మనుపెన్నడూ లేని విధంగా సర్వర్లు డౌన్ కావడంతో అభ్యర్థులు నిరాశకు లోను కాగా సుదూర ప్రాంతాలనుంచి వచ్చిన తల్లిదండ్రులు అసహనానికి గురికావడం కనిపించింది. ఆలస్యంగా వెబ్‌కౌనె్సలింగ్‌ప్రారంభం కావడంతో షెడ్యూల్ ప్రాప్తికి భిన్నంగా సర్ట్ఫికెట్ల పరిశీలన ప్రక్రియ మరింతజాప్యం కానుంది. ఈనెల 9నుంచి వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవాల్సిన అభ్యర్థులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు సూచించారు. అలాగే ఎన్ సి సి, రక్షణశాఖ, క్యాప్, పిహెచ్‌సి, స్పోర్ట్స్ కోటాలో ర్యాంకులు పొందిన అభ్యర్థులు మాత్రం విజయవాడ పాలిటెక్నిక్ కళాశాలలో వెబ్‌కౌన్సిలింగ్‌కుహాజరు కావాలని ఇక్కడి అధికారులు సూచిస్తున్నారు.
సర్వర్ నిర్వహణ పనుల వల్ల జాప్యం
ఇంజినీరింగ్ వెబ్‌కౌనె్సలింగ్‌కు సర్వర్లు సహకరించకపోవడం వల్ల జాప్యం జరిగిందని ప్రిన్సిపల్ విఎస్ దత్తు ఇన్‌చార్జి మేజర్ శివకుమార్ తెలిపారు. హైదరాబాద్‌లోని సర్వర్లు నిర్వహణ పనులు, సాంకేతిక నిపుణులు చేపట్టడం వలన రాత్రి 7గంటలకు ఈప్రక్రియ ప్రారంభమయిందని స్పష్టంచేశారు. మిగిలిన కౌనె్సలింగ్ యథావిధిగా కొనసాగుతుందని ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలన్నారు.

భార్యపై భర్త దాడి
* చికిత్స పొందుతూ వివాహిత మృతి
గార, జూన్ 6: భార్యాభర్తల మధ్య గొడవ ప్రాణాలు తీసుకునే పరిస్థితికి వచ్చిన సంఘటన గార పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. మండలం వత్సవలస పంచాయతీ పేర్లవానిపేట గ్రామానికి చెందిన మైలపల్లి మహేష్ సీమెన్‌గా పని చేస్తున్నాడు. పనికి వెళ్లిన అతడు జూన్ 1న గ్రామానికి చేరుకు న్నాడు. ఆ తరువాత రోజు గురువారం రాత్రి కుటుంబ తగాదాతో భార్య లక్ష్మి (35)పై దాడి చేయడంతో ఆమె అపస్మారక స్థితికి వెళ్లిపోయింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం రిమ్స్‌లో చేర్చారు. అయితే చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం అర్ధరాత్రి మృతి చెందింది. లక్ష్మి మృతి చెందడంతో లక్ష్మి సోదరుడు బాలక్రిష్ణ గార పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు సి.ఐ. ఆర్. అప్పలనాయుడు దర్యాప్తు చేస్తున్నారని గార పోలీసులు తెలిపారు.

అభివృద్ధికి అందరూ సహకరించాలి
* ఎంపి రామ్మోహన్‌నాయుడు
సీతంపేట, జూన్ 6: రాష్ట్ర విభజన అనంతరం తీవ్ర లోటు బడ్జెట్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభివృద్ధి పథంలో నడిపించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. సోమవారం సీతంపేట సామాజిక భవనంలో ఏర్పాటు చేసిన నవ నిర్మాణ దీక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నవ నిర్మాణ దీక్షలో ప్రతి ఒక్కరు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లా బాగా వెనుకబడిన జిల్లా అని, ఈ జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన నాడే వలసల నివారణ సాధ్యపడుతుందన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గిరిజన ప్రాంతాల్లో మారుమూల గ్రామాలకు సిసి రహదారులు, మంచినీటి సౌకర్యాలకు రూ.7 కోట్లు వరకు నిధులు కేటాయించడం జరిగిందన్నారు. నవ నిర్మాణ దీక్ష ద్వారా ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయి, ఇంకా ప్రజలకు చేయాల్సిందేముందన్న దానిపై ఈ దీక్ష ద్వారా అభిప్రాయాలు సేకరించడం జరుగుతుందన్నారు. అనంతరం దీక్షను ఉద్దేశించి కలెక్టర్ లక్ష్మీనృసింహం మాట్లాడుతూ అవినీతి నిర్మూలిస్తే స్వపరిపాలన సాధ్యపడుతుందన్నారు. ప్రతి కుటుంబం ఆదా యం పెంచుకోవాలన్నారు. ఆదాయం పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాల్సిన అవసరముందన్నారు. కుటుంబాల సామాజిక భద్రత వంటి వాటిపై ఈ నెల 8న మహాసంకల్పం పేరుతో కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలిపారు. 16వేల కోట్ల లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని ఒడిదుడుకులు నేపధ్యంలో అభివృద్ధి పథంలో ప్రభుత్వం ముందుకు నడిపిస్తుందన్నారు. యువతకు ఉద్యోగవకాశాలు, వలసల నివారణ తదితరమైనవాటిపై ప్రత్యేక దృష్టిసారించాల్సి ఉందన్నారు. జిల్లాలో 5,412 గృహాలు అసంపూర్తిగా ఉన్నాయని, వీటితో పాటు మరికొన్ని గృహా లు పూర్తికి 112 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదించినట్టు తెలిపారు. జిల్లాపై పారిశ్రామికవేత్తలకు అభద్రతాభావం ఉన్నందున పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. ఏదిమైనా ప్రజలందరూ ప్రభుత్వానికి పూర్తిగా సహకరించాల్సిన అవసరముందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మీ, ఐటిడిఎ పిఒ జల్లేపల్లి వెంకటరావు, టిడిపి పాలకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ, జిల్లా కో- ఆప్షన్ సభ్యులు సవర తోట ముఖలింగం, ఎంపిటిసి దమయంతినాయుడు, ఈ ఈ శ్రీనివాస్, పలువురు అధికారులు పాల్గొన్నారు.