శ్రీకాకుళం

రెండంకెల వృద్ధిరేటే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరఘట్టం, జూన్ 6: జిల్లాలోని వ్యవసాయశాఖ ఈ ఏడాది రెండెంకల వృద్ధిరేటు సాధించడమే లక్ష్యంగా నిర్ణయించి తమ వంతు చర్యలు తీసుకోవడం జరుగుతోందని వ్యవసాయశాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ రామారావు తెలిపారు. సోమవారం స్థానిక కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలు ద్వారా వృద్ధిని సాధిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల 60 వేల 955 హెక్టార్లలో సాగు విస్తీర్ణం ఉందని, దీంట్లో 2లక్షల 13 వేల హెక్టార్ల విస్తీర్ణంలో వరి పంట పండుతుండగా, మిగిలిన విస్తీర్ణంలో ఇతర పంటలు సాగులో ఉన్నట్టు తెలిపారు. ఈ మేరకు మొక్కజొన్న 12 వేల హెక్టార్లు, చిరు ధాన్యాలు 2 వేల హెక్టార్లు, కంది 2 వేలు, పెసర 3 వేలు, మినుములు వెయ్యి హెక్టార్లు, వేరుశనగ నాలుగు వేల హెక్టార్లు, నువ్వులు 1350 హెక్టార్లు, పత్తి 8,200 హెక్టార్లు, గోగు మూడు వేల హెక్టార్లు, చెరకు 6 వేల విస్తీర్ణంలో సాగు జరుగుతున్నట్టు తెలిపారు. ఈ ఏడాది వరి 20.17 శాతం, జొన్న 8.51 శాతం, వేరుశనగ 28.48 శాతం, పెసలు 97.97 శాతం ఇతర పంటలు 21.37 శాతం వృద్ధి సాధించినట్టు తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో 55,904 మెట్రిక్ టన్నుల విత్తనాలు వరి విత్తనాలకు ప్రతిపాదించగా, ఇప్పటికే 30 వేల మెట్రిక్ విత్తనాలు ఏపి సీడ్స్ ద్వారా రప్పించినట్టు తెలిపారు. అలాగే వేరుశనగ 800 క్వింటాళ్లు, పచ్చిరొట్ట 8 వేలు, పెసలు మూడు వేల క్వింటాళ్లు, మినుములు 200 క్వింటాళ్లు, కందులు 113 క్వింటాళ్లు, మొక్కజొన్న 100 క్వింటాళ్లు రాగా వీటన్నింటినీ ప్రభుత్వ సబ్సిడీపై రైతులకు పంపిణీ చేస్తామన్నారు. అలాగే ఎరువులు లక్షా 3 వేల 230 మెట్రిక్ టన్నులు ప్రతిపాదించగా వీటిలో యూరియా 55 మెట్రిక్ టన్నులు, డిఎపి 19 మెట్రిక్ టన్నులు, ఎంఒపి 17 టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 15 మెట్రిక్ టన్నులు సిద్ధం చేశామన్నారు. ఇప్పటికే 10 వేల మెట్రిక్ టన్నులు యూరియా రాగా మిగిలినవి రానున్నట్టు తెలిపారు. అలాగే జిల్లాలో అంతరించిపోతున్న చిరు ధాన్యాలను ప్రోత్సహించి గిరిజన రైతులతో పండించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు వీరఘట్టం, సీతంపేట మండలాల్లో ఎన్‌జిఒల ద్వారా మూడేళ్లలో 3,500 హెక్టార్ల విస్తీర్ణంలో పండించేలా దృష్టిసారించినట్టు తెలిపారు. ఇందులో కొర్రలు, రాగులు, జొన్నలు, గంటెలు తదితర రకాలు 50 శాతం రాయితీపై సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. ఈ చిరు ధాన్యాల వృద్ధికి ఆర్ట్స్, చిన్నయ్య ఆదివాసీ సంఘాలతో ఒప్పందం జరిగిందన్నారు. ఈ పంటలను ఆత్మ, వ్యవసాయ శాఖ సంయుక్తంగా పర్యవేక్షణ చేస్తుందన్నారు. ఇదిలావుండగా రైతులు వారి పొలం గట్లుపై వృథాగా ఉండకుండా కందులు వేసేందుకు 50 శాతం రాయితీపై విత్తనాలు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. అలాగే ఈ ఏడాది రైతులకు అవసరమైన పనిముట్లు, యంత్రాలు ఎంతమందికైనా సరఫరా చేయనున్నామన్నారు. జిల్లాలో 32 ఎంపిహెచ్ ఇఒ పోస్టులు ఉండగా, వీటికి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు తెలిపారు. అలాగే 9 ఏఒ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, కమిషనర్ కార్యాలయం ఆ పోస్టులు భర్తీ చేయనుందన్నారు. ఈ ఏడాది జిల్లాలో లక్షా 29 వేలు మట్టి నమూనాలు సేకరించామని ఇందులో సూక్ష్మధాతు లోపం ఉందని, ఇందుకోసం జింక్ సల్ఫేడ్, బోరాను, జిప్సమ్ తదితరమైనవి సరఫరా చేయనున్నామన్నారు. ఈయన వెంట పాలకొండ ఎడి బొడ్డేపల్లి రాజగోపాలరావు, ఏఇ ఒలు గోవిందరావు, భవానీలున్నారు.