క్రీడాభూమి

స్టెయిన్ ఫిట్టేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్, నవంబర్ 23: దక్షిణాఫ్రికా పేసర్, ప్రపంచ నంబర్ వన్ బౌలర్ డేల్ స్టెయిన్ ఫిట్నెస్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈనెల 25 నుంచి భారత్‌తో మొదలయ్యే మూడో టెస్టులో అతను ఆడతాడా లేదా అన్నది ఇంకా ఖరారు కాలేదు. సోమవారం అతను కొంత సేపు నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. అయితే, అతను కండరాల నొప్పి నుంచి పూర్తిగా కోలుకోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మ్యాచ్ ఆరంభానికి ముందు అతనిని తుది జట్టులోకి తీసుకునే విషయాన్ని ఖాయం చేస్తారు. స్టెయిన్ గాయం తీవ్రత గురించిగానీ, అతను మూడో టెస్టులో ఆడతాడా లేదా అన్న అంశాన్ని గురించిగానీ మరో పేసర్ మోర్న్ మోర్కెల్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. సహచరులతో కలిసి నెట్స్‌కు హాజరైన అతను తర్వాత జట్టు తరఫున విలేఖరుల సమావేశంలో పాల్గొన్నాడు. పలు అంశాలను ప్రస్తావించిన అతను స్టెయిన్ ఫిట్నెస్‌పై విలేఖరులు అడిగిన ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వలేదు. నెట్స్‌లో స్టెయిన్ ప్రాక్టీస్ చేశాడని అన్నాడు. అయితే, కండరాలు బెణకడాన్ని అత్యంత సాధారణంగా కనిపించే తీవ్రమైన సమస్యగా అతను అభివర్ణించాడు. అందుకే బుధవారం ఉదయం మ్యాచ్ ఆరంభానికి ముందుగానీ ఒక నిర్ణయం తీసుకోలేమని అన్నాడు. ఈ విషయంలో వ్యక్తిగత అభిప్రాయాలకు తావులేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. తమపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని వినిపిస్తున్న వాదనను మోర్కెల్ తోసిపుచ్చాడు. పోటీకి దిగిన తర్వాత ఒత్తిడి అందరిపైనా ఉంటుందన్నాడు. మూడో టెస్టు ఉత్కంఠ భరితంగా సాగుతుందని జోస్యం చెప్పాడు. (చిత్రం) విదర్భ క్రికెట్ సంఘం మైదానంలో సోమవారం నెట్ ప్రాక్టీస్ చేస్తున్న దక్షిణాఫ్రికా క్రికెటర్లు

ఫామ్‌లోకి వస్తాం
దక్షిణాఫ్రికా కెప్టెన్ ఆమ్లా ధీమా
నాగపూర్, నవంబర్ 23: భారత్‌తో జరిగే మూడో టెస్టులో మళ్లీ ఫామ్‌లోకి వచ్చి, ఎదురుదాడి చేస్తామని దక్షిణాఫ్రికా కెప్టెన్ షహీం ఆమ్లా ధీమా వ్యక్తం చేశాడు. సోమవారం అతను విలేఖరులతో మాట్లాడుతూ ఒక టెస్టులో పరాజయాన్ని ఎదుర్కొన్నంత మాత్రాన తమపై ఒత్తిడి ఉంటుందని అనుకోవడం తప్పని అన్నాడు. భారత్‌ను నిలువరించే సామర్థ్యం తమకు ఉందన్నాడు. టీమిండియాను పటిష్టమైన జట్టుగా పేర్కొంటూనే, తీవ్రమైన పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పాడు.