జాతీయ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో ఆస్పత్రులకు అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: ఆస్పత్రుల్లో స్వచ్ఛత, ప్రమాణాల పెంపు విషయంలో తెలంగాణలో ని పలు ఆస్పత్రులకు 2017-18గానూ కాయాకల్స్ అవార్డులు లభించాయి. కింగ్ కోఠి, ఖమ్మం జిల్లా ఆస్పత్రి, భాన్స్‌వాడ, భద్రాచలం ఆస్పత్రులకు అవార్డులు దక్కాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గురువారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డులు ప్రదానం చేశారు. ఆస్పత్రుల ప్ర మాణాల పెంపునకు, కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మం త్రి లక్ష్మారెడ్డి ప్రోత్సాహమే ప్రధాన కారణమని అవార్డును అందుకున్న ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ మదన్ సింగ్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో..
అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా ఆస్పత్రికి, అనంతపురం జిల్లా హిందూపురం ఏరియా ఆస్పత్రులకు అవార్డులు దక్కాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఏరియా ఆస్పత్రికి ద్వితీయ స్థానం లభించగా, సీహెచ్‌సీల విభాగంలో విజయనగరం జిల్లా ఎస్.కోట ఆస్పత్రికి ప్రోత్సాహక బహుమతి లభించింది. ఏ లూరు, హిందూపురం ఆస్పత్రులకు రూ.50 లక్షల చొప్పున, ఆత్మకూరు ఆస్పత్రికి రూ.10 లక్షలు, ఎస్.కోట ఆస్పత్రికి రూ.2లక్షల నగదు బహుమతి దక్కింది.