హైదరాబాద్

న్యాయ అంశాలపై బల్దియా సిబ్బందికి శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో రోజురోజుకి అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. అక్రమ నిర్మాణాలను క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం అపుడపుడు అమలు చేసే క్రమబద్దీకరణ స్కీం కూడా మున్ముందు అనుమతించే అవకాశాల్లేవని స్పష్టం చేసిన నేపథ్యంలో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు జీహెచ్‌ఎంసీ మరో నిర్ణయాన్ని తీసుకుంది. అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చివేసేందుకు ఇప్పటి వరకు బల్దియానే ఖర్చు భరించేది. కానీ యజమానికి అక్రమంగా, నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన దాన్ని బల్దియా నిధులను ఖర్చు చేసి ఎందుకు కూల్చివేయాలన్న విషయాన్ని పరిశీలించిన అధికారులు ఇకపై అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు అయ్యే ఖర్చు యజమానే చెల్లించాలని సరికొత్త నిర్ణయాన్ని ప్రాథమికంగా తీసుకున్నట్లు బల్దియా కమిషనర్ దాన కిషోర్ వెల్లడించారు. శనివారం ఆయన ప్రధాన కార్యా1లయంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత, శిథిల భవనాల తొలగింపు తదితర టౌన్‌ప్లానింగ్ సంబంధిత అంశాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో రోజురోజుకి అక్రమ నిర్మాణాల సంఖ్య బాగా పెరుగుతుందని, దీనికి కారణం చట్టం పట్ల అక్రమ నిర్మాణదారుల్లో భయం లేకపోవటమే ప్రధాన కారణమని వివరించారు. అధికారుల అలసత్వం కూడా ఇందుకు తోడైందని కమిషనర్ వ్యాఖ్యానించారు. ఇక నుంచి అక్రమ నిర్మాణాలను గుర్తించి, నోటీసులు జారీ చేసి, ఆ తర్వాత వాటిని కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు. కూల్చివేతకు అయ్యే వ్యయాన్ని నిర్మాణదారుడి నుంచి వసూలు చేయాలని, ఈ అంశంపై మున్సిపల్ చట్టంలోనూ స్పష్టత ఉందని కమిషనర్ వివరించారు. ఈ విషయంలో చదరపు అడుగుకు వర్తింపజేసే జరిమానా, ప్రత్యేక ఖాతా, చట్టపరమైన అంశాలతో కూడిన ప్రతిపాదనలను స్టాండింగ్ కమిటీలో ప్రవేశపెట్టి అమోదం పొందనున్నట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీకి తరుచూ అందే ఫిర్యాదుల్లో సుమారు 80 శాతం టౌన్‌ప్లానింగ్ విభాగానికి సంబంధించినవి ఉన్నట్లు తెలిపారు. వివిధ కోర్టుల్లో జీహెచ్‌ఎంసీకి చెందిన 5160 పై చిలుకు కేసులుండగా, వీటిలో దాదాపు నాలుగు వేలకు పైగా టౌన్‌ప్లానింగ్‌కు చెందినవి ఉన్నట్లు తెలిపారు. అక్రమ నిర్మాణాలపై ఇకపై కఠినంగా వ్యవహారించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి లీగల్ కేసుల పట్ల సకాలంలో స్పందించకపోవటమే ఈ పరిస్థితికి కారణమని అన్నారు. లీగల్ అంశాలు, కోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలు, కౌంటర్లు వేయటం వంటి తదితర అంశాలపై బల్దియా సిబ్బందికి తగిన శిక్షణను కూడా ఇప్పించనున్నట్లు తెలిపారు. అక్రమ నిర్మాణాల గుర్తింపు, నోటీసుల జారీ, భవన నిర్మాణ అనుమతుల్లో అతిక్రమణలు, క్షేత్ర స్థాయిలో నిర్మాణ వాస్తవ పరిస్థితులను తెలియజేసేందుకు ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ యాప్‌ను నిర్వహించేందుకు టౌన్‌ప్లానింగ్ అధికారులందరికీ ప్రత్యేకంగా ట్యాబ్‌లను అందజేయనున్నట్లు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో దేవేందర్ రెడ్డి, శ్రీనివాసరావు పాల్గొన్నారు.