జాతీయ వార్తలు

త్రయంబకేశ్వరాలయంలో మహిళలకు అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాసిక్, ఏప్రిల్ 15: ఆలయ ప్రవేశంలో స్ర్తి పురుష సమానత్వం పాటించాలంటూ ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతిరోజూ గంటసేపు గర్భగుడిలోకి మహిళలను అనుమతించాలని మహారాష్ట్ర నాసిక్‌లోని త్రయంబకేశ్వర దేవస్థానం ట్రస్టు నిర్ణయించింది. అయితే గర్భగుడిలో పూజలు చేసేటప్పుడు వారు తడి నూలు వస్త్రాలు లేదా పట్టు వస్త్రాలు ధరించాలని షరతు పెట్టింది. అయితే మహిళా ఉద్యమకారులు ఈ షరతును పాటించడానికి నిరాకరించడమే కాకుండా ఉద్దేశపూర్వకంగా మహిళలను ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నందుకు ట్రస్టు సభ్యులు, స్థానికులపైన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గురువారం నుంచి ప్రతిరోజూ ఉదయం ఆరునుంచి ఏడు గంటల వరకు మహిళలను షరతులతో గర్భగుడిలోకి అనుమతించాలని ట్రస్టు బుధవారం నిర్ణయం తీసుకుందని ఆలయ ట్రస్టీల్లో ఒకరైన లలితా షిండే చెప్పారు. ఆలయం గర్భగుడిలోకి మహిళలను అనుమతించాలంటూ పుణెకు చెందిన వనితా గుట్టే నేతృత్వంలోని స్వరాజ్య సంఘటన్ అనే సంస్థ ఆందోళన చేపట్టిన తర్వాత ట్రస్టు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే గురువారం ఉదయం గుట్టే, తోటి ఆందోళనకారులు తడి బట్టలు ధరించి గర్భగుడిలోకి ప్రవేశించడానికి నిరాకరించారు. ఆ సమయంలో చాలామంది స్థానిక పూజారులు ‘సోవల’లు (పట్టు వస్త్రాలు) ధరించి గర్భగుడిలోకి వచ్చారు. ఆందోళనకారులు, ఆలయ అధికారుల మధ్య వాగ్వాదంలో గంటసేపు సమయం గడిచిపోయిందని లలితా షిండే చెప్పారు. ఇదిలా ఉండగా ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారంటూ గుట్టే ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు గురువారం రాత్రి కొంతమంది ఆలయ ట్రస్టీలు, స్థానిక పూజారులుసహా దాదాపు 250 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు త్రయంబకేశ్వర్ పోలీసు స్టేషన్ ఇన్‌చార్జి హరిభావు కోల్హే శుక్రవారం చెప్పారు. వనితా గుట్టే ఫిర్యాదు చేసిన వారిని గుర్తించడానికి ఆలయంలోని 45 సిసిటీవీ కెమెరాల ఫుటేజ్‌ని, ఇతర అంశాలను తాము పరిశీలించాల్సి ఉందని ఆయన చెప్పారు. కాగా, గురువారమే వనితా గుట్టే, ఇతర మహిళా ఉద్యమకారులు నాసిక్‌నుంచి వెళ్లిపోయారని పోలీసులు చెప్పారు.