జాతీయ వార్తలు

వెయ్యి కోట్లు సాయం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: తెలంగాణలో కరవు పరిస్థితులను ఎదుర్కొని రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే వెయ్యి కోట్లు కేటాయించాలని టిఆర్‌ఎస్ సభ్యుడు భీంరావుపాటిల్ డిమాండ్ చేశారు.
పాటిల్ బుధవారం లోక్‌సభలో కరవుపై జరిగిన చర్చలో పాల్గొం టూ రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో 438 మండలాలుండగా ఇందులో నుండి 231 మండలాల్లో కరవు నెలకొన్నదని చెప్పారు. వర్షాలు పడకపోవటంతో తొమ్మిది జిల్లాల్లో పంటలు పెద్ద ఎత్తునష్టపోయాయని ఆయన తెలిపారు. ప్రజలకు తాగేందుకు మంచినీరు లభించటం లేదు, పశులకు గ్రాసం లేదన్నారు. కరువు మూలంగా రైతుల సమస్యలు వర్ణణాతీతమని పాటిల్ చెప్పారు. వ్యవసాయ కార్మికులు, బడుగు,బలహీన వర్గాల ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. కరువు మూలంగా పిల్లలు పాఠశాలలకు వెళ్లటం లేదంటూ పలు కుటుంబాలు పట్టణ ప్రాంతాలకు వలసపోతున్నాయని పాటిల్ వివరించారు. కరువు మూలంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే దాదాపు ముపై ఐదు మిలియన్ల ప్రజలు ప్రభావితులయ్యారని ఆయన చెప్పారు. 12లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నది, పంటదిగుబడి కూడా బాగా తగ్గిపోయిందని పాటిల్ చెప్పారు. కరువు వలన చిన్న, సన్నకారు రైతులు చాలా నష్టపోయినట్లు ఆయన తెలిపారు. కరువు ప్రాంతాల్లో సహాయ,పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు 2,514 కోట్లరూపాయలు అవసరమవుతాయంటూ కేంద్ర ప్రభుత్వం వెంటనే కనీసం వెయ్యి కోట్లు కేటాయించాలని పాటిల్ డిమాండ్ చేశారు.