జాతీయ వార్తలు

అత్యాచార బాధితుల్లో 46% మంది మైనర్లే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: దేశ రాజధాని ఢిల్లీలో అత్యాచార బాధితుల్లో 46 శాతం మంది మైనర్‌లేనని ఓ నివేదికలో వెల్లడైంది. 2013లో 1,636 అత్యాచారం ఘటనలు చోటుచేసుకోగా అందులో 757 మంది బాధితులు మైనర్‌లే. 2014లో 2,166 అత్యాచారం కేసులు నమోదుకాగా వెయ్యి నాలుగు మంది బాధితులు మైనర్‌లేనని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 2015 అక్టోబర్ 31వరకూ అందిన లెక్కల ప్రకారం 1856 మందిపై అత్యాచారాలు జరగ్గా అందులో 824 మంది బాధితులు 18 ఏళ్ల లోపువారేనని ప్రభుత్వం రాజ్యసభలో ప్రకటించింది. ప్రతి రెండు రోజులకు ఐదుగురు మైనర్‌లు కామాంధులకు బలైపోతున్నారని పేర్కొన్నారు.
మహిళపై లైంగిక దాడులను అరికట్టడానికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని తెలిపారు. మహిళలకు భద్రత కల్పించడంతోపాటు నేరాలకు పాల్పడుతున్న వారిపట్ల కఠినంగా వ్యవహిస్తున్నట్టు సభకు చెప్పారు. రాజధాని ఢిల్లీలో 2014లో అత్యధికంగా అత్యాచారం కేసులు 80.79 శాతం పెరిగాయని వివరించారు. ప్రస్తుత సంవత్సరం అక్టోబర్ నెలాఖరు నాటికి 77.16 శాతం నమోదయ్యాయని అన్నారు.
మహిళపై జరుగుతున్న నేరాలను నిరోధించడంతోపాటు కేసుల విచారణ మహిళా పోలీసు అధికారులతోనే చేపడుతున్నట్టు రాజ్యసభకు వెల్లడించారు. 2014లో 17,699 మంది మహిళలు, బాలికలకు ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్టు కేంద్ర హోమ్‌శాఖ సహాయ మంత్రి హరీభాయ్ పార్త్భీయ్ చౌదరి స్పష్టం చేశారు.

సాక్ష్యాలు చూపండి

రాహుల్‌కు కేంద్ర మంత్రుల సవాల్

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: నేషనల్ హెరాల్డ్ కేసు ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఓ)లో తయారైందని, ఇది నూటికి నూరు శాతం కక్ష సాధింపేనని విమర్శించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ప్రభుత్వం ఎదురుదాడికి దిగింది. ఆయన సభాకాలాన్ని వృథా చేయడానికి బదులు ప్రభుత్వం, ప్రధానమంత్రి కార్యాలయంపై తాను చేసిన ఆరోపణలకు పార్లమెంటులో సాక్ష్యాలు చూపించాలని సవాలు విసిరింది. నేషనల్ హెరాల్డ్ కేసు నూటికి నూరు శాతం పిఎంఓ కార్యాలయంనుంచి తయారైన కక్షసాధింపు మాత్రమేనని రాహుల్ ఆరోపించిన కొద్ది సైపటికే ఈ అంశంపై పార్లమెంటులో మాట్లాడే ధైర్యం రాహుల్ గాంధీకి లేదని కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ అన్నారు. ‘పార్లమెంటులో గొడవకు ఆయనే ప్రధాన కారకుడు. ఆయన, ఆయన తల్లి సోనియా గాంధీకి వ్యతిరేకంగా న్యాయస్థానం ఒక నిర్ణయం తీసుకుంది. తమపై అభియోగాలు వచ్చాక వారు ఒక హీరో కావాలని అనుకుంటున్నారు. అదే సమయంలో పార్లమెంటు లోపల మాట్లాడే ధైర్యం వారికి లేదు. అందుకే వారు బయట మీడియాతో మాట్లాడుతున్నారు. మీకే గనుక ధైర్యం ఉంటే, మీకే గనుక నిజాయితీ ఉంటే, మీ పార్టీకి మీరు ఒక నాయకుడిగా ఉంటే బైట మీడియాతో ఏం అన్నారో అదే పార్లమెంటులోపలికి వచ్చి చెప్పండని మేము రాహుల్ గాంధీని అడుగుతున్నాం’ అని రూడీ అన్నారు. ‘ప్రభుత్వానికి, ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఓ)కు వ్యతిరేకంగా తాను చేసిన ప్రకటనకు సాక్ష్యాలు చూపించాలి. ఆయన పార్లమెంటుకు వచ్చి, తాను మాట్లాడిన దానిపై వివరణ, సాక్ష్యాన్ని ఇవ్వాలి’ అని ఆయన అన్నారు.
కాగా, ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి, పార్లమెంటుకు ఎలాంటి సంబంధం లేదు గనుక ఈ వ్యవహారాన్ని కోర్టులోనే పరిష్కరించుకోవాలని మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కాంగ్రెస్ పార్టీకి సూచించారు. వ్యవహారం కోర్టులో ఉండగా కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా న్యాయ వ్యవస్థపై దాడి చేస్తోందని మరో మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ అన్నారు. ‘ఇనే్నళ్లుగా ఏ పార్టీ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తోందో ఎవరికి తెలియదు? అంతేకాదు కక్ష సాధింపు అని వాళ్లు అన్నారంటే అది న్యాయ వ్యవస్థను తప్పుబట్టడమే’ అని రాథోడ్ అన్నారు.