జాతీయ వార్తలు

వేధింపు ధోరణి సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: ఎన్‌డిఏ ప్రభుత్వం తమ అధినాయకులపై రాజకీయ కక్ష సాధింపుచర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ సభ్యులు బుధవారం కూడా పార్లమెంటు ఉభయ సభలను స్తంభింపజేశారు. ఎన్‌డిఏ ప్రభుత్వం కాంగ్రెస్‌తోపాటు ఇతర ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించగా, కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ కేసుకోసం పార్లమెంటు ద్వారా ఢిల్లీ హైకోర్టును ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తోందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు విమర్శించారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరుగుతున్నప్పుడు సభలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వౌనంగా ఉండిపోయారు తప్ప కాంగ్రెస్ ఆరోపణలకు స్పందించలేదు. కాంగ్రెస్ సభ్యుల నిరసన మూలంగా ఉభయ సభలు ఏడుసార్లు వాయిదా పడ్డాయి. రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ రాజ్యసభను నాలుగు సార్లు వాయిదా వేసిన అనంతరం రేపటికి వాయిదా వేసినా, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మాత్రం సభను వాయిదాలతోనే సాయంత్రం ఆరు గంటల వరకు నడిపించారు. పోడియం వద్దకు వచ్చిన కాంగ్రెస్ సభ్యులు పలుమార్లు సుమిత్రా మహాజన్, డిప్యూటీ స్పీకర్ తంబిదురై, వెంకయ్య నాయుడు, ఇతర మంత్రులు, అధికార పక్షం సభ్యులతో వాదోపవాదాలకు దిగారు. కాంగ్రెస్‌కు తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ఇవ్వటంతో సభ పలుమార్లు గందరగోళంలో పడిపోయింది. పోడియం వద్ద నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తున్న కాంగ్రెస్ ఎంపీలు ఒక దశలో డిప్యూటీ స్పీకర్ తంబిదురై టేబుల్‌పై ఉన్న వస్తువులను చెదర గొట్టేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ ఎంపీలు పోడియం వద్ద నిలబడి ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూనే ఉన్నారు. ‘కక్ష రాజకీయాలు కూడదు’, ‘నియంతలా వ్యవహరించకూడదు’, ‘కాంగ్రెస్‌ను భయపెట్టేందుకు ప్రయత్నిస్తే లాభం ఉండదు’ అంటూ రకరకాల నినాదాలిచ్చారు. కాంగ్రెస్ ఎంపీ ఎంత విజృంభించినా సుమిత్రా మహాజన్, తంబిదురై మాత్రం సభను పలుమార్లు వాయిదా వేశారు తప్ప రేపటి వరకు వాయిదా వేసేందుకు అంగీకరించలేదు. బుధవారం ఉదయం పదకొండు గంటలకు సభ ప్రారంభం కాగానే సుమిత్రా మహాజన్ ఒక ప్రకటన చేస్తూ కాంగ్రెస్, టిఎంసి, ఇతర పార్టీలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించి ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే మల్లికార్జున ఖర్గే నిలబడి సభలో కాంగ్రెస్ నిరసన తెలిపేందుకు దారితీసిన పరిస్థితులను వివరించేందుకు అనుమతి కోరుగా, సుమిత్రా మహాజన్ తిరస్కరించారు. కాంగ్రెస్ సభ్యుల నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని పూర్తి చేశారు. జీరో అవర్ ప్రారంభం కాగానే మొదట మల్లికార్జున ఖర్గేతో మాట్లాడించారు. ఎన్‌డిఏ ప్రభుత్వం కాంగ్రెస్‌తోపాటు ఇతర అన్ని ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ ఆరోపణలు కురిపించారు. ఈ ఆరోపణలకు వెంకయ్య నాయుడు బదులిచ్చారు. ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతోందనటం ఎంతమాత్రం నిజం కాదన్నారు. కోర్టు ఆదేశంతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు, పార్లమెంటు ద్వారా కోర్టును ప్రభావితం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని వెంకయ్య నాయుడు ఆరోపించారు. తమకు మాట్లాడేందుకు అనుమతి ఇవ్వటం లేదంటూ తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు సభ నుండి వాకౌట్ చేశారు. గొడవ మధ్యలోనే భారత ట్రస్ట్ సవరణ బిల్లు, దేశంలో నెలకొన్న కరువుపై చర్చ జరిపిన అనంతరం ఆరు గంటలకు సభను రేపటికి వాయిదా వేశారు.
రాజ్యసభలో..
నేషనల్ హెరాల్డ్ వివాదంలో తమ నాయకురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఢిలీ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజకీయ వేధింపేనని ఆరోపిస్తూ కాంగ్రెస్ సభ్యులు రెండవ రోజు కూడా రాజ్యసభను స్తంభింపచేశారు. సభ ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ సభ్యులు మూకుమ్మడిగా తమకు న్యాయం కావాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకువచ్చారు. కోర్టులో ఉన్న అంశంతో ప్రభుత్వానికి సంబంధం లేదనీ, అతి ముఖ్యమైన అంశాలపై చర్చ జరగవలసి ఉన్నందున సభ నడవడానికి సహకరించవలసిందిగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కాంగ్రెస్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేని అంశాన్ని లేవదీసి సభను అడ్టుకోవటం ద్వారా కాంగ్రెస్ అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు. సభలో సాధారణ పరిస్థితి లేకపోవటంతో డిప్యూటీ చైర్మన్ కురియన్ పదిహేను నిమిషాలపాటు వాయిదా వేశారు. తరువాత ప్రతిపక్ష నాయకుడు గులామ్ నబీ అజాద్ మాట్లాడుతూ అవినీతి ఆరోపణలలో చిక్కుకున్న కేంద్ర మంత్రి, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులపై ఎలాంటి చర్యా తీసుకోని మోదీ ప్రభుత్వం హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారించటానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులను రంగంలోకి దించి తన ద్వంద్వనీతిని నిరూపించుకుందని ఆరోపించారు. అజాద్ మాట్లాడిన తరువాత తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డెరిక్ ఓబ్రేన్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం నిర్భయంగా ప్రత్యర్థులను వేధిస్తోందని చెప్పారు. రాష్ట్రాల వ్యవహారాలలో తలదూరుస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం ఏ విధంగా ప్రత్యర్థులను వేధిస్తోందో సాక్ష్యాధారాలతో నిరూపించాలని నఖ్వీ సవాలు చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్చకైనా సిద్ధమేనని, ప్రతిపక్ష నాయకుడే చర్చను మొదలుపెట్టాలని ఆయన సవాల్ చేశారు. చర్చను చేపట్టవలసిందిగా డిప్యూటీ చైర్మన్ కురియన్ సూచించారు. అయితే నినాదాలు ఆగకపోవటంతో సభను మళ్లీ వాయిదా వేశారు. 12 గంటలకు చైర్మన్ అన్సారీ ప్రశ్నోత్తరాల కార్యక్రమన్ని చేపట్టేంనుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తరువాత కూడా పరిస్థితిలో మార్పు రాకపోవటంతో సభ రేపటికి వాయిదా పడింది.
chitram...

లోక్‌సభలో మాట్లాడుతున్న కాంగ్రెస్ ఎంపీ ఖర్గే

రాజ్యసభలో ముక్తార్ అబ్బాస్ నఖ్వీ