యుద్ధప్రాతిపదికన అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 24: దక్షిణ మధ్య రైల్వేలో ప్రస్తుతం నడుస్తున్న కొత్త మార్గాల నిర్మాణం, డబ్లింగ్, విద్యుద్దీకరణ వంటి అభివృద్ధి పనులు జరుగుతున్న తీరును దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా సమీక్షించారు. సికిందరాబాద్‌లోని రైల్ నిలయంలో ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని విభాగాల అధికారులు, నిర్మాణ సంస్థల అధిపతులు, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సికిందరాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, నాందేడ్ డిఆర్‌ఎంలు పాల్గొన్నారు. ప్రస్తుతం నడుస్తున్న పనులన్నీ పరిశీలించిన జిఎం రవీంద్ర గుప్తా పనులన్నీ నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని సూచించారు. నంద్యాల-ఎర్రగుంట్ల, పెద్దపల్లి-నిజామాబాద్, మునీరాబాద్-మహబూబ్‌నగర్, బీదర్-గుల్బర్గా, రాఘవాపురం-పెద్దపేట, మంచిర్యాల్-మందమర్రి, కాజీపేట్-విజయవాడ (మూడోలైన్) పర్బణి-ముద్ఖేడ్ పనులను ఆయన పరిశీలించారు. చివరి దశలోని ప్రాజెక్టులన్నీంటికీ ప్రాధాన్యమివ్వాల్సిన అవసరముందని తద్వారా వౌలిక సదుపాయాలు పెరిగి సామర్థ్యం మెరుగుపడుతుందన్నారు. అదేవిధంగా ఆర్‌విఎన్‌ఎల్ చేపట్టిన ఎంఎంటిఎస్ ఫేజ్-2, విజయవాడ-గుంటూరు-అమరావతి కొత్త మార్గం, సికిందరాబాద్-మహబూబ్‌నగర్ డబ్లింగ్, గుంటూరు-తెనాలి డబ్లింగ్, విద్యుదీకరణ, విజయవాడ-్భమవరం డబ్లింగ్, విద్యుదీకరణ, విజయవాడ-గూడూరు మూడోలైను, గుంతకల్లు-కల్లూరు విద్యుద్దీకరణ, వాడి-రాయ్‌చూర్-గుంతకల్లు విద్యుదీకరణ, కాజీపేట్ వర్క్‌షాప్, యాద్గిర్‌లోని రైల్‌బోగీ కార్ఖానా వంటి పనుల్లో పురోభివృద్ధిని జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా అడిగి తెలుసుకున్నారు.
ఎంఎంటిఎస్ ఫేజ్-2కు సంబంధించి 5 మార్గాల్లో పనులు ఏకకాలంలో వేగవంతంగా నడుస్తున్నాయని, మార్చి 2017 నాటికి 44 కి.మీ. కొత్తమార్గంలో ఇంజన్‌ను నడిపి పరీక్షించడం జరుగుతుందన్నారు. ఈ మార్గంలోని ప్రధాన వంతెనల పనులు పూర్తయ్యాయనీ, 86 శాతం మట్టి పనులు కూడా పూర్తయ్యాయని ఆయన వివరించారు. ఈ సమావేశంలో అదనపు జనరల్ మేనేజర్ ఎకె గుప్తా, ప్రధానపాలనాధికారి భూల్‌చందాని, ఆర్‌విఎన్‌ఎల్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ పి శ్రీనివాస్, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్ ఎన్‌ఎన్ సింగ్, చీఫ్ ఆపరేషన్స్ ఇంజనీర్ ఎన్ మధుసూదనరావు, చీఫ్ కమర్షియల్ మేనేజర్ పి గణేశ్వర రావు, ఎఫ్‌ఎ అండ్ సిఎఓ పద్మినీ రాధాకృష్ణన్, చీఫ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఇంజనీర్ ఎంఎస్ మహబూబ్ అలీ తదితరులు పాల్గొన్నారు.

మంగళవారం రైల్‌నిలయంలో జరిగిన విస్తృతస్థాయ సమావేశంలో మాట్లాడుతున్న జిఎం రవీందర్ గుప్తా