రాష్ట్రీయం

ఇక ఇంటింటికీ ఇంటర్నెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 6: ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం రోజురోజుకూ పెరుగుతోందని, ఇది హర్షణీయమని ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం తన నివాసం నుంచి ప్రభుత్వ యంత్రాంగంతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసే అభివృద్ధి, సంక్షేమ పథకాల పూర్తి సమాచారం ప్రతి గ్రామ పంచాయతీలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ వచ్చే సమయం చాలా దగ్గరలోనే ఉందన్నారు. ఇదే సమయంలో ప్రతి మహిళా ఇ-లిటరేట్ కావాలని కోరారు. రాష్ట్రంలో ఇది ఒక విప్లవమని చెప్పారు. దీర్ఘకాలిక సెలవు పెట్టిన ప్రభుత్వ వైద్యులను తక్షణం సర్వీసు నుంచి తొలగించి వారి స్థానంలో వెంటనే కొత్త నియామకాలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. విద్య, ఆరోగ్య రంగాల్లో కచ్చితంగా నిర్దేశిత ప్రమాణాలను పాటించాలని కోరారు. ఇందుకు వీలుగా అవగాహనను మెరుగు పరచుకోవాలన్నారు. 15 శాతం వృద్ధిరేటు లక్ష్యంగా ప్రతి శాఖ పనిచేయాలని ఆదేశించారు. ఎన్‌ఆర్‌ఇజిఎస్ నిధులు ఇప్పటివరకూ 2600 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. ఇంకా 800 కోట్ల రూపాయలు మిగిలి ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సిఎం సూచించారు. ప్రతి జిల్లాలో 10 కోట్ల రూపాయల నిధులు జిల్లా కలెక్టర్ల వద్ద ఉన్నాయని, వాటితో పంటకుంటల తవ్వకం, సిమెంట్ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న నిధుల్ని పూర్తి స్థాయిలో సమర్థవంతంగా వినియోగించుకుంటున్నామని తెలిపారు. ఆగస్ట్ 15 నుంచి చంద్రన్న బీమా పథకాన్ని అమల్లోకి తీసుకొస్తున్నామని వెల్లడించిన ఆయన ఉన్న వనరులు, అవకాశాలను దృష్టిలో పెట్టుకుని మహా సంకల్ప అజెండాను రూపొందించుకోవాలని సూచించారు. ప్రతి శాఖ తన ప్రాధాన్యతలను ఎనిమిదో తేదీలోగా తెలియచేయాలని, వాటిని కడపలో 8న జరిగే మహా సంకల్పంలో క్రోడీకరిస్తామని చంద్రబాబు వివరించారు.

చిత్రం అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ఏపి సిఎం చంద్రబాబు నాయుడు