రాష్ట్రీయం

ఆర్టీసీని ఏం చేద్దాం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 9: నష్టాల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ ఆర్టీసి)ను గట్టెక్కించి లాభాలబాటలో నడపించడం పట్ల ముఖ్యమంత్రి దృష్టి సారించారు. డీజిల్ ధరలు పెరగడం, ఆక్యుపెన్సీ రేటు తగ్గడంతో కష్టాల్లో పడిన ఆర్టీసీని గట్టెక్కించేందుకు చార్జీలు పెంచడమా? లేక ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అనే్వషించాలా? అనే అంశంపై ముఖ్యమంత్రి కసరత్తు ప్రారంభించారు. రెండు మూడు రోజుల్లో డిపో మేనేజర్ స్థాయినుంచి ఆర్టీసి మేనేజింగ్ డైరెక్టర్ వరకు అన్నిస్థాయిల అధికారులతో కూడిన విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గురువారం ఆదేశించారు. రవాణాశాఖ మంత్రి పి మహేందర్‌రెడ్డి, ఆర్టీసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఆర్టీసి మేనేజింగ్ డైరెక్టర్ జివి రమణారావు గురువారం ముఖ్యమంత్రిని కలిశారు. ఆర్టీసి ప్రస్తుతం రూ. 700 కోట్ల నష్టాలతో ఉందని, పైగా నిరుడు ఆర్టీసి కార్మికులకు ఫిట్‌మెంట్ 44 శాతం ప్రకటించడంతో జీతభత్యాల భారం మరింత పడిందని వారు వివరించారు. అలాగే డిజిల్ ధరలు పెరుగుతున్నాయని, అయినప్పటికీ ఆర్టీసి చార్జీలు పెంచకపోవడం కూడా నష్టాలకు కారణంగా వారు వివరించినట్టు తెలిసింది. రాష్టవ్య్రాప్తంగా డిపోల వారిగా ఎన్ని బస్సులు నడుస్తున్నాయి, వాటిలో ఎన్ని కొత్తవి ఉన్నాయి, వాటి కండిషన్ ఎలా ఉంది, ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేట్ ఎలా ఉంది, రాబడి ఎంత? నష్టం ఎంత పూర్తి వివరాలతో తనకు నివేదిక అందజేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు.