రాష్ట్రీయం

రాకెట్ లాంచర్లతో మావోల యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు, జూన్ 9: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కొండాగావ్ జిల్లాలో ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి) క్యాంపుపై మావోయిస్టులు బుధవారం అర్థరాత్రి మెరుపుదాడి చేశారు. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని రాకెట్ లాంచర్లు, కాల్పులతో విరుచుకుపడ్డారు. భద్రతా బలగాలు వ్యూహాత్మకంగా వ్యవహరించి, మావోయిస్టుల దాడిని తిప్పికొట్టారు. కొండాగావ్ జిల్లాలోని రణపాల్ వద్ద ఉన్న 41వ బెటాలియన్‌కు చెందిన ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్ క్యాంపును సుమారు వంద మంది మావోయిస్టులు మూడు వైపుల నుండి చుట్టుముట్టారు. అనంతరం నాలుగు రాకెట్ లాంచర్లతో క్యాంపుపై దాడి చేశారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు మావోయిస్టుల దాడిని తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. మావోయిస్టులు భద్రతా బలగాలపై కాల్పులకు సైతం దిగారు. పోలీసులు, మావోయిస్టుల మధ్య మూడు గంటలపాటు హోరాహోరీగా కాల్పులు చోటు చేసుకున్నాయి.
ఇరువర్గాల మధ్య 600 రౌండ్లు కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఈ దాడుల్లో భద్రతా బలగాలకు ఎటువంటి ప్రాణనష్టం కలుగలేదని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. తమ వద్ద రాకెట్ లాంఛర్లు ఉన్నాయి. మావోయిస్టులు నాలుగు రాకెట్ లాంఛర్లను క్యాంపుపై ప్రయోగించారని, మూడు లభ్యమయ్యాయని, మరొక దాని కోసం వెతుకుతున్నట్లు వెల్లడించారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ రాకెట్ లాంఛర్లతో క్యాంపు అతిసమీపం నుంచి దాడి చేశారని, వారు లాంఛర్లను ఉపయోగించేందుకు వాడిన టూల్ కిట్స్ కూడా దొరికాయని, దాడిని విశే్లషించుకుంటున్నామని తెలిపారు. కూంబింగ్ ఆపరేషన్లు జరుగుతున్నాయని, దాడిలో పాల్గొన్న మావోయిస్టులను పట్టుకుంటామని ఎస్పీ వివరించారు. అధునాతన ఆయుధ సంపత్తితో యుద్ధానికి దిగుతున్నాం అంటూ గత మూడేళ్లుగా ప్రకటనలు చేస్తున్న మావోయిస్టులు అన్నట్లుగానే బుధవారం తెల్లవారుఝామున ఛత్తీస్‌గఢ్‌లో పోలీస్ క్యాంపుపై రాకెట్ లాంఛర్లతో మెరుపుదాడికి దిగారు. తొలిసారిగా రాకెట్ లాంఛర్లతో మావోయిస్టులు దాడి చేయడం విశేషం. దీన్ని కేంద్రం కూడా సీరియస్‌గా పరిగణిస్తోంది.
చిత్రం రాకెట్ లాంచర్ శకలాలను చూపిస్తున్న జవాను. క్యాంపు సమీపంలో పడిన రాకెట్ లాంచర్లు