జాతీయ వార్తలు

స్వచ్ఛ్భారత్ పైలట్ ప్రాజెక్టుకు తిరుపతి ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 8: దేశంలోని పలు ప్రముఖ స్థలాలను శుభ్రం చేసేందుకు చేపేట్టిన స్వచ్ఛ్భారత్ పైలట్ ప్రాజెక్టులో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి చోటు దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు కింద చేపట్టే వంద ప్రముఖ స్థలాల్లో తొలి పదింటిని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. వీటిల్లో జమ్మూకాశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయం, ఉత్తరప్రదేశ్‌లోని తాజ్‌మహల్, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, పంజాబ్‌లోని గోల్డెన్ టెంపుల్, రాజస్థాన్‌లోని అజ్మీర్ షరీఫ్, ఒడిశాలోని జగన్నాథ ఆలయం, మహారాష్టల్రోని ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఉత్తరప్రదేశ్‌లోని మణికర్నిక ఘాట్, తమిళనాడులోని మీనాక్షి టెంపుల్, అసోంలోని కామాఖ్య ఆలయాన్ని ఎంపిక చేసినట్లు కేంద్ర తాగునీరు, శానిటేషన్ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమార్ వెల్లడించారు. కేంద్రం ఎంపిక చేసే వాటిల్లో పర్యాటక, మతపరమైన ప్రదేశాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. వీటి ఎంపికపై కేంద్రం కసరత్తు చేస్తోందని తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద తొలి దశలో ఎంపిక చేసిన ఈ పది ప్రదేశాల్లో స్వచ్ఛ్భారత్ కార్యక్రమం పూర్తికాగానే మిగిలిన తొంభై ప్రదేశాలపై దృష్టి సారించనున్నట్లు తోమార్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తిచేసేందుకు వరల్డ్‌బ్యాంక్ నిపుణుల సహకారం తీసుకోనున్నట్లు తాగునీరు, శానిటేషన్ శాఖ కార్యదర్శి పరమేశ్వర్ అయ్యర్ తెలిపారు. వివిధ దేశాల్లో పరిశుభ్రత కోసం అనుసరించిన విధానాన్ని అధ్యయనం చేసి, ఇక్కడి పరిస్థితులకు సరిపడే విధానాన్ని ఎంపిక చేస్తామని ఆయన పేర్కొన్నారు.