జాతీయ వార్తలు

దుబాయినుంచే రిక్రూట్‌మెంట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 9: దుబాయి నుంచే హైదరాబాద్‌లో ఐసిస్ సానుభూతిపరుల రిక్రూట్‌మెంట్ జరిపేందుకు యత్నించానని, హైదరాబాద్‌లో నలుగురితో కలసి భారీ విధ్వంసానికి కుట్ర పన్నినట్టు ఇటీవల అరెస్టైన ఐదుగురిలో కీలక వ్యక్తి ఇబ్రాహీం యజ్దాని ఎన్‌ఐఏ దర్యాప్తులో తెలిపాడు. ఈ నెల 3నుంచి ఎన్‌ఐఏ కస్టడీలోని ఉగ్రవాది ఇబ్రహీం ద్వారా కీలక సమాచారం రాబట్టిన అధికారులు మహరాష్ట్ర, హైదరాబాద్, అనంతపురంకు తీసుకెళ్లి విచారించారు. ఈ నెల 15 వరకు కొనసాగనున్న దర్యాప్తులో మరికొంత సమాచారం లభ్యమయ్యే అవకాశం ఉందని శనివారం ఎన్‌ఐఏ డిజి సంజీవ్‌కుమార్ తెలిపారు. మహరాష్టల్రోని నాందేడ్‌లో మారణాయుధాల కొనుగోలు, హైదరాబాద్ సంతోష్‌నగర్‌కు చెందిన నిజాముద్దీన్ ద్వారా సిమ్ కార్డుల కొనుగోలు, అనంతపురం బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జిలో బస చేసి తుపాకులు కొనుగోళ్లకు యత్నించినట్లు ఇబ్రహీం అంగీకరించినట్టు పేర్కొన్నారు. తలాబ్‌కట్ట, భవాని నగర్‌లోని ఓ మీసేవ కేంద్రం నుంచి ఐసిస్ చీఫ్‌తో చర్చలు జరిపినట్టు ఇబ్రహీం తన రిమాండ్‌లో పేర్కొన్నాడు.
రంజాన్, బోనాల పండుగలను టార్గెట్ చేసుకొని విధ్వంసానికి పాల్పడాలనే ఉగ్రవాదుల కుట్రను ఎన్‌ఐఏ అధికారులు భగ్నం చేశారు. గురువారం రంజాన్ పండుగ ప్రశాంతంగా జరిగినప్పటికీ బోనాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో నగరంలో ఉగ్రవాదులు ఇంకెవరైనా ఉన్నారా? పేలుడు పదార్థాలు ఎక్కడైనా దాచారా? అని అనుమానంతో తనిఖీలు చేపట్టారు. శనివారం పాతబస్తీలోని బహదుర్‌పుర, హసన్ నగర్‌లో నగర పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 400 మంది పోలీసులతో చేపట్టిన తనిఖీల్లో పలువురు రౌడీషీటర్లతోపాటు, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారని తెలుస్తోంది. జిరాక్స్ ఐడి కార్డులతో నగరంలో నివాసముంటున్న వీరు ఉగ్రవాదులా లేక దొంగలా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని సౌత్‌జోన్ డిసిపి వి సత్యనారాయణ తెలిపారు.

చిత్రం.. హైదరాబాద్ పోలీసుల అదుపులో అనుమానితులు