జాతీయ వార్తలు

‘పోలవరం’పై బాబు కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,ఆగస్టు 24: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగకుండా చూసేందుకు భయంకరమైన కుట్ర జరుగుతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన కమీషన్లు, స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర పరిధిలో ప్రాజెక్టు నిర్మాణం కొనసాగిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ఆరోపించారు. ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ఏ ప్రయోజనాల కోసం కేంద్రం నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో నిర్మిస్తున్నారని ప్రశ్నించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు. దీన్ని 2018లోగా నిర్మించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. ఈ మేరకు రాష్ట్ర విభజన చట్టంలో హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని విభజన చట్టంలో లేకపోయినా దాని గురించి పట్టుపడుతున్న బాబు చట్టంలో ఉన్న పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని ఎందుకు అడగటం లేదని ఆయన నిలదీశారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి పోలవరాన్ని దెబ్బ తీస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. ‘విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం నిర్మించవలసి ఉంది. అయితే ఎందుకోగానీ కేంద్రం ప్రాజెక్టు నిర్మాణం పనిని చేపట్టటం లేదు. నిర్మాణ బాధ్యతలు తమకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరటం లేదు. ఇదే విధంగా చంద్రబాబుకూడా ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రానికి అప్పగించటం లేదు. ఎందుకిలా జరుగుతోంది?’ అని ఆయన నిలదీశారు. ‘చంద్రబాబు తెలివిలేనివాడా? సామర్థ్యం లేనివాడా? చేవ చచ్చినవాడా? ధైర్యం లేనివాడా? పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయటం గురించి కేంద్రంతో ఎందుకు మాట్లాడటం లేదు?’ అంటూ కెవిపి ప్రశ్నలు కురిపించారు.
చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రస్తుతం ఏమీ చేయటం లేదని, స్వార్థ ప్రయోజనాలు, తన కుటుంబ ప్రయోజనాలు పూర్తి అయిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకు పడతారని ఆయన జోస్యం చెప్పారు. తన ప్రయోజనం తీరగానే చంద్రబాబు ఉగ్రరూపం ధరిస్తాడని ఎన్డీఏ ప్రభుత్వం నుండి తప్పుకుంటాడని ఆయన చెప్పారు. కేవలం కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో నిర్మిస్తున్నాడని ఆయన పదేపదే ఆరోపించారు.
ఇద్దరూ భట్రాజులే
చంద్రబాబు, కేంద్ర సమాచార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఒకరినొకరు పొగుడుకుంటూ భట్రాజుల్లా వ్యవహరిస్తున్నారని కెవిపి ఆరోపించారు. వీళ్లిద్దరూ తమ ప్రయోజనాల కోసం ఒకరినొకరు పొగుడుకుంటూ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నారని ఆయన ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పోలవరం కోసం నిర్మించిన కాలువలను ఉపయోగించుకుని పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసిన చంద్రబాబు, ఆయనకు వంత పాడుతున్న వెంకయ్య గత రెండేళ్లలో రాష్ట్భ్రావృద్ధికి ఏమీ చేయలేదని చెప్పారు. ‘వీరిద్దరూ కలిసి రాష్ట్రంలో ఒక్క కొత్త ప్రాజెక్టునైనా పూర్తి చేశారా?’ అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాలని ఆయన చంద్రబాబును డిమాండ్ చేశారు.
కొత్త రాష్ట్రంలో హైకోర్టు భవమాన్ని నిర్మించలేకపోయిన బాబు అమరావతిలో ఒలింపిక్స్ క్రీడలు నిర్వహిస్తాడా? అని కెవిపి ఎద్దేవా చేశారు. ‘నాకు తెలిసినంత వరకు రానున్న మూడు ఒలింపిక్స్ క్రీడలు జరుగవలసిన దేశాల ఎంపిక జరిగిపోయింది, ఇక నాలుగో ఒలింపిక్స్‌ను చంద్రబాబునాయుడు నిర్వహించాలనుకున్నా నిర్వహించలేడు, నాలుగో ఒలింపిక్స్ క్రీడలు జరిగే సమయానికి చంద్రబాబు, నేను బతికి ఉంటామా?’ అని ఆయన ప్రశ్నించారు. పోలవరంలో భయంకరమైన కుట్ర జరుగుతోందనడానికి మీ వద్ద ఏమైనా సాక్ష్యాలున్నాయా? అని అడుగగా ఇటీవల జరుగుతున్న పరిణామాలే ఇందుకు ఉదాహరణ అని రామచంద్రరావు చెప్పారు.