జాతీయ వార్తలు

చెరువులో పడిన బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధుబని/ పాట్నా, సెప్టెంబర్ 19: బిహార్‌లోని మధుబని జిల్లాలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 35 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. మధుబని నుంచి 65 మంది ప్రయాణికులతో సీతామడి వెళ్తున్న బస్సు హైవేలోని బసైతాచౌక్ వద్ద ఓ చెరువులో పడిపోయింది. ఇప్పటి వరకూర 10 మృతి దేహాలు వెలికితీశామని ఎస్‌పి దీపక్ కుమార్ తెలిపారు. ప్రయాణికుల్లో కొందరు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగలికారని ఆయన అన్నారు. బస్సును కూడా క్రేన్ల సాయంతో బయటకు తీశారు. గల్లంతైన మిగతా ప్రయాణికుల కోసం గాలింపుజరుపుతున్నారు. ఈదుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. మరోపక్క ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బాధిత కుటుంబాలకు నాలుగు లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. ప్రమాదకారణాలపై దర్యాప్తు జరుపుతామని వెల్లడించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పలువురు రాష్ట్ర మంత్రులు హుటాహుటిన సంఘటనా స్థలానికి తరలివెళ్లారు. ప్రమాదం జరిగిన చాలా సేపటికిగానీ సహాయ బృందాలు రాకపోవడం పట్ల సమీపంలోని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న పోలీసుల బృందాలపై ఆగ్రహంతో రాళ్లు విసిరారు.