జాతీయ వార్తలు

గోవా తొలి మహిళా సిఎం శశికళ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ, అక్టోబర్ 28: గోవా తొలి మహిళా ముఖ్యమంత్రి శశికళ కాకోద్కర్ (81) శుక్రవారం కన్నుమూశారు. దీర్ఘకాలంగా అస్వస్థురాలిగా ఉన్న ఆమె అల్టిన్హోలోని నివాసంలో మృతి చెందారు. గోవా మాజీ ముఖ్యమంత్రి దయానంద్ బండోద్కర్ కుమార్తె శశికళ మధ్యాహ్నం 1.10 గంటలకు చనిపోయారని ఆమె కుమారుడు సమీర్ కాకోద్కర్ వెల్లడించారు. శశికళ మృతికి నివాళిగా రాష్ట్రంలో రెండు రోజలు సంతాప దినాలుగా ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ శుక్రవారం సెలవుఇచ్చారు. ఆమె నెల రోజులుగా మంచపైనే ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. 1973లో తండ్రి మరణానంతరం ముఖ్యమంత్రి పదవి చేపట్టిన శశికళ 79లో మహారాష్ట్ర గోమంతక్‌పార్టీలో చీలిక వచ్చేవరకూ కొనసాగారు. ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలన్న డిమాండ్‌తో ముందుండి ఉద్యమాన్ని నడిపారు. సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో శశికళ చురుకైన పాత్ర పోషించేవారు. శశికళకు ముగ్గురు కుమారులు. శనివారం ఆమెకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబీకులు వెల్లడించారు.
కాగా శశికళ కాకోద్కర్ మృతిపై గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ ప్రగాఢ సంతాపం తెలిపారు. రాష్ట్భ్రావృద్ధికి ఆమె చేసిన సేవలు నిరుపమానమని ఆయన అన్నారు.