జాతీయ వార్తలు

ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఢిల్లీలో ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 2: ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల ఎన్‌కౌంటర్ నిరసనగా ప్రజాసంఘాలు దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించాయి. ఆంధ్రా, ఒడిశా ప్రభుత్వాలు చెబుతున్నట్లు మల్కన్‌గిరిలో జరిగింది ఎన్‌కౌంటర్ కాదని ప్రజా సంఘాలు ఆరోపించాయి. కోవర్టు ఆపరేషన్ ద్యారా ఆదివాసులు, మావోయిస్టులపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నరమేధానికి పాల్పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ ధర్నా కార్యక్రమానికి 27 ప్రజా సంఘాలు, ప్రతినిధులు పాల్గొన్నారు. సిపిఐ రాజ్యసభ సభ్యుడు డి రాజా, ప్రొఫెసర్ సాయిబాబా, ప్రభాకర్ సిన్హా, వి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ జరిపించాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. పోలీస్ కస్టడీలో ఉన్న మావోయిస్టు ఆగ్రనేత ఆర్కేతో సహా 10 మంది మావోయిస్టు నాయకులను కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశాయి.