జాతీయ వార్తలు

ఇదిగో డిజిటల్ టీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిజిటల్ చెల్లింపులకు ఉపయోగించే డెబిట్, క్రెడిట్ కార్డులు, ప్రీపెయిడ్ కార్డులు, డిజిటల్ వ్యాలెట్, ఈ-వ్యాల్లెట్లు, అంతర్జాల బ్యాంకింగ్ విధానం, యునిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ యాప్స్‌లను త్వరితగతిన విస్తరించేందుకు అనుసరించాల్సిన ప్రణాళికను ఈ కమిటీ సిఫార్సు చేయాల్సి ఉంటుంది.

న్యూఢిల్లీ, నవంబర్ 30: ఇక దేశంలో డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రోత్సహించాలని కేంద్రం యోచిస్తోంది. అందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధ్యయనం చేసేందుకు బుధవారం నీతిఆయోగ్ ఓ కమిటీని వేసింది. ఐదుగురు సిఎంలు, ఐదుగురు నిపుణులతో కూడిన కమిటీకి ఏపీ సిఎం చంద్రబాబు కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రెండురోజుల క్రితమే చంద్రబాబుతో టెలిఫోన్‌లో మాట్లాడి కమిటీ ఏర్పాటు గురించి స్వయంగా చెప్పటం తెలిసిందే. చంద్రబాబు ఆమోదం తీసుకున్న తరువాతే బుధవారం కమిటీని కేంద్రం అధికారికంగా ప్రకటించటం గమనార్హం. చంద్రబాబు కన్వీనర్‌గా వ్యవహరించే కమిటీలో ఒడిశా, మధ్యప్రదేశ్, సిక్కిం, పాండిచ్చేరి, మహారాష్ట్ర సిఎంలు నవీన్ పట్నాయక్, శివరాజ్‌సింగ్ చౌహాన్, పవన్‌కుమార్ చామ్లింగ్, వి నారాయణ స్వామి, దేవేంద్ర ఫడ్నవిస్‌లతోపాటు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పానగరియ సభ్యులుగా వ్యవహరిస్తారు. అలాగే నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ కమిటీ సభ్య కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఉదయ్ అధ్యక్షుడు నందన్ నీలేఖని, బోస్టన్ కన్సల్టెన్సీ చైర్మన్ జనమేజయ సింహా, నెట్‌కోర్ మేనేజింగ్ డైరక్టర్ రాజేష్ జైన్, ఐ స్పిరిట్‌కు చెందిన శరద్ శర్మ, ఐఐఎం (అహ్మదాబాద్) ప్రొఫెసర్ డాక్టర్ జయంత్ వర్మ (ఫైనాన్స్) కమిటీ ప్రత్యేక ప్రతినిధులుగా ఉంటారు. ఈ కమిటీ డిసెంబర్ 3న ఢిల్లీలో తొలి సమావేశం జరిపే అవకాశాలు ఉన్నాయి. ఇదిలావుంటే పాండిచ్చేరి సిఎం నారాయణ స్వామి కమిటీలో ఉండేందుకు అంగీకరిస్తారా? లేదా అనేది స్పష్టం కాలేదు. పార్టీ హైకమాండ్ అంగీకరిస్తేనే కమిటీలో కొనసాగుతానని నారాయణ స్వామి అంటున్నట్టు తెలిసింది. బీహార్ సిఎం నితీశ్‌కుమార్‌ను కమిటీలో నియమించాలనుకున్నా, ఆయన చివరి క్షణంలో నిరాకరించినట్టు సమాచారం.
ప్రపంచంలోని వివిధ దేశాల్లో అమల్లోవున్న అత్యంత సమర్థ డిజిటల్ చెల్లింపుల విధానాన్ని కమిటీ పరిశీలించిన అనంతరం దేశంలో అమలుకు అనుకూలమైన విధానాన్ని సిఫార్సు చేయాల్సి ఉంటుంది. డిజిటల్ చెల్లింపులకు ఉపయోగించే డెబిట్, క్రెడిట్ కార్డులు, ప్రీపెయిడ్ కార్డులు, డిజిటల్ వ్యాలెట్, ఈ వ్యాల్లెట్లు, అంతర్జాల బ్యాంకింగ్ విధానం, యుపిఐ (యునిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) బ్యాంకింగ్ యాప్స్‌లను త్వరితగతిన విస్తరించేందుకు అనుసరించాల్సిన ప్రణాళికను కమిటీ సిఫార్సు చేయాల్సి ఉంటుంది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వలన కలిగే లాభాలు, ఇతర సౌకర్యాలను ప్రజలకు తెలియజేసి వ్యవస్థకు సన్నద్ధం చేసేందుకు అవసరమైన కార్యచరణ వ్యూహాన్ని రచిస్తుంది. డిజిటల్ విధానంలో ఆర్థిక లావాదేవీల నిర్వహణకు అవసరమైన రోడ్ మ్యాప్ ఏర్పాటు, ఈ విధానం అమలులో ఎదురయ్యే సమస్యలు, పరిష్కార సూచనలు రూపొందిస్తుంది. మొత్తంగా కీలక పాత్ర నిర్వహించే వాటిని గుర్తించటం, కమిటీ అధికారులకు పని అప్పగించటం, లక్ష్య సాధనకు అవసరమైన ఇతర సమస్యల పరిష్కారం.. ఇవన్నీ చంద్రబాబు కమిటీ ప్రధాన బాధ్యతలని నీతి ఆయోగ్ బుధవారం సాయంత్రం జారీ చేసిన ప్రకటనలో పేర్కొంది.