జాతీయ వార్తలు

35 నక్సల్స్ ప్రభావిత జిల్లాలకు వెయ్యి కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 6: నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటుగా మావోయిస్టులతో పోరాడడం కోసం అవసరమైన సదుపాయాలను సమకూర్చుకోవడానికి ఏడు రాష్ట్రాల్లోని 35 నక్సల్స్ ప్రభావిత జిల్లాలకు వెయ్యి కోట్ల రూపాయల గ్రాంట్‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం ఆమోదించింది. ఈ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో జార్ఖండ్‌లో 16 జిల్లాలు, చత్తీస్‌ఢ్‌లో ఎనిమిది జిల్లాలు, బిహార్‌లో ఆరు, ఒడిశాలో రెండు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక్కో జిల్లా ఉన్నాయి. వామపక్ష తీవ్రవాదం ప్రభావం అధికంగా ఉన్న ఏడు రాష్ట్రాల్లోని 35 జిల్లాలకు వెయ్యి కోట్ల రూపాయల అదనపు కేంద్రసహాయంలో రాష్ట్రాలవారీ కేటాయింపులకు హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదం తెలిపినట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జిల్లాకు రూ. 28.57 కోట్ల రూపాయల చొప్పున మంత్రిత్వ శాఖ కేటాయించింది. ఈ లెక్కన జార్ఖండ్‌కు రూ. 457.42 కోట్లు, చత్తీస్‌గఢ్‌కు రూ 228.56 కోట్లు, బిహార్‌కు రూ. 171.42 కోట్లు, ఒడిశాకు రూ. 57.14 కోట్లు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తలా రూ. 28.57 కోట్లను కేటాయించారు. ఆయా జిల్లాల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి, అలాగే నక్సలిజంతో పోరాడడం కోసం అవసరమైన సదుపాయాలను సముపార్జించుకోవడం కోసం ఈ నిధులను ఉపయోగిస్తారని హోం మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు చెప్పారు.