జాతీయ వార్తలు

హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికిందరాబాద్-దర్బంగా, హైదరాబాద్-రాక్సల్ మధ్య 52 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం ఉమాశంకర్ కుమార్ తెలిపారు. సికిందరాబాద్-దర్బంగా మధ్య 36, హైదరాబాద్-రాక్సల్ మధ్య 16 రైళ్లు నడుస్తాయి. సికిందరాబాద్-దర్బంగా ప్రత్యేక రైలు నెం. 07007 సికిందరాబాద్ నుంచి డిసెంబర్ 2, 5, 9, 12, 16, 19, 23, 26, 30 తేదీలలో, జనవరి 2, 6, 9, 13, 16, 20, 23, 27, 30 తేదీలలో ఈ ప్రత్యేక రైలు నడుస్తాయి. ఈ రైళ్లు రా.గం. 22:00లకు బయలుదేరి, మరుసటి రోజు మ.గం. 13:45లకు దర్బంగా చేరుకుంటుంది. అదేవిధంగా ట్రైన్ నెం. 07005 హైదరాబాద్-రాక్సల్ రైలు హైదరాబాద్ నుంచి గం.21:30లకు డిసెంబర్ 7, 14, 21, 28 తేదీలలో బయలుదేరి మరుసటి రోజులన ఉ.గం. 01:30లకు రాక్సల్ చేరుకుంటుంది. ఈ నెల 23న నడిచే ప్రత్యేక రైళ్లు సికిందరాబాద్-విజయవాడ, సికిందరాబాద్-నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్టు పేర్కొన్నారు.